Crop

గులాబీ పంటలో పెనుబంక యాజమాన్యం

పెనుబంక అనేది మొక్కల నుండి రసాన్ని పీల్చే కీటకాలు. ఇవి చిన్నగా, గుండ్రటి ఆకారంలో  ఆకుపచ్చ, పసుపు మరియు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పొడవాటి, సన్నని స్పర్శ కొమ్ము మరియు రెండు గొట్టాలను (కార్నికల్స్ అని పిలుస్తారు) కలిగి ఉంటుంది,  ఇవి శరీరం యొక్క వెనుక భాగం నుండి విస్తరించి ఉంటాయి. వివిధ ఎదుగుదల దశలలో, పెను బంక యొక్క రూపాన్ని మార్చుకుంటూ, పిల్ల పెను బంక రెక్కల పురుగు కంటే చిన్నవి మరియు రంగు తేలికగా ఉంటుంది. 

గులాబీలను సాధారణంగా ఆశించే పురుగులలో పెనుబంక ఒకటి. ఇది మొక్కలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. పెనుబంకను తరచుగా “మొక్క పేను” అని పిలుస్తారు, ఎందుకంటే వాటి ఆహారపు అలవాట్లు వలన చెట్టు పెరగకపోవడం, ఆకుల మరియు పువ్వులు రాలిపోవడం కొన్ని సందర్భాలలో మొక్క కూడా చనిపోవడం జరుగుతుంది. గులాబీలు ముఖ్యంగా పెనుబంక నుండి ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది, ఎందుకంటే కీటకాలు లేత  కొమ్మల నుండి రసాన్ని పీల్చి నష్టపరురుస్తుంటాయి. ప్రస్తుతం, పెనుబంక యొక్క పెరుగుతున్న ప్రాబల్యం గురించి భారతదేశంలోని గులాబీ పండిస్తున్న రైతులలో ఆందోళన పెరుగుతోంది మరియు చాలా మంది ఈ తెగుళ్ళను నియంత్రించడానికి సమర్థవంతమైన మార్గాల కోసం చూస్తున్నారు.

వివిధ రకాల సంక్రమణ :

పెనుబంక రసం పీల్చే కీటకం, అవి గులాబీ మొక్క యొక్క కాండం, ఆకులు మరియు మొగ్గల రసాన్ని పీలుస్తూ మొక్కకు నష్టం కలిగిస్తాయి.

 శాస్త్రీయ నామం: మాక్రోసిఫమ్ రోసే

ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాలు:

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో గులాబీలకు సాధారణంగా ఆశించే పురుగులలో పెనుబంక ఒకటి. సాధారణంగా వెచ్చని, తేమతో కూడిన వాతావరణ  ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో పెనుబంక ప్రభావం ఉంటుంది. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్నాటక వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు పెనుబంక ప్రభావం ఎక్కువగా ఉంది.

లక్షణాలు:

  • గులాబీ మొక్కలపై పెనుబంక ఉనికిని సులువుగా కనుకోవచ్చు ఆకులు దెబ్బ తినడం, పసుపు రంగులోకి మారడం మరియు ఆకులు మరియు కాండం మీద తేనె జిగురు అని పిలువబడే జిగట వంటి వాటి ద్వారా సులభంగా గుర్తించవచ్చు
  • మొగ్గలు రాలడం మరియు పువ్వులు వాడిపోవడం.
  • పెనుబంక తీవ్రంగా ఉన్నపుడు, మొక్కలు కుంగిపోయి మరియు చనిపోవచ్చు.

నియంత్రణ చర్యలు:

గులాబీ పంటలలో పెనుబంకను సమర్థవంతంగా నివారించడానికి తరచుగా వివిధ నియంత్రణ చర్యల చేపట్టడం అవసరం. పెనుబంకను నియంత్రించడానికి ఉపయోగించే కొన్ని సాధారణ సమికృత తెగులు నిర్వహణ పద్ధతులు అవసరం .

సాంప్రదాయ చర్యలు:

  • విత్తే సమయం: సరైన సీజన్‌లో గులాబీలను నాటడం పెనుబంకను అరికట్టడానికి సహాయపడుతుంది. అనేక ప్రాంతాలలో, సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో గులాబీలను నాటడం వల్ల పెనుబంక గుడ్లు అధికంగా ఉండే పరిమాణాన్ని తగ్గించవచ్చు మరియు  సీజన్ ప్రారంభంలో పెనుబంకను నివారించవచ్చు.
  • అంతరపంటలు: బంతి పువ్వు వంటి సహచర మొక్కలతో గులాబీలను అంతరపంగా వేసుకోవడం ద్వారా పెనుబంక ఉదృతిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ సహచర మొక్కలు పెనుబంక నుండి గులాబీలను రక్షించడానికి  ఉచ్చు పంటగా పనిచేస్తాయి మరియు అవి పెనుబంకను నియంత్రించడంలో సహాయపడే సహజ పురుగుమందులను కూడా విడుదల చేయగలవు.
  • ఎర పంటలు: కొన్ని సందర్భాల్లో, ఎర పంటను నాటడం ద్వారా పెనుబంకను నియంత్రించడానికి సమర్థవంతమైన మార్గం. ఉదాహరణకు, గులాబీల దగ్గర నాస్టూర్టియమ్‌లను నాటడం వలన గులాబీల నుండి పెనుబంకను ను ఆకర్షిస్తుంది, వాటి జనాభాను తగ్గిస్తుంది మరియు గులాబీలకు హానిని తగ్గిస్తుంది.

భౌతిక చర్యలు:

  • రెక్కల పురుగును ట్రాప్ చేయడానికి మరియు చంపడానికి లైట్ ట్రాప్‌లను ఉపయోగించవచ్చు. ఒక హెక్టారుకు 4 లైట్ ట్రాప్‌లను పెట్టుకోవడం ద్వారా సమర్థవంతంగా  పెనుబంకను నివారించవచ్చు .
  • రోజా పంటల నుండి పెనుబంకను  భౌతికంగా మినహాయించడానికి వరుస కవర్లు వంటి అడ్డంకులను ఉపయోగించవచ్చు. గులాబీలు ఎదుగుదల ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

యాంత్రిక చర్యలు:

  • పెనుబంక సోకిన మొక్కల భాగాలను సేకరించడం మరియు నాశనం చేయడం  ద్వారా పెనుబంక జనాభాను తగ్గించడానికి సమర్థవంతమైన మార్గం. పెనుబంక గుడ్లు పెట్టే అవకాశం రాకముందే ఇలా చేయాలి.
  • పెనుబంక జనాభాను తెలుసుకోవడానికి మరియు వాటి సంఖ్యను తగ్గించడానికి  బంక అట్ట ఉచ్చులను ఉపయోగించాలి. పెనుబంకను ఆకర్షించడంలో పసుపు బంక ఉచ్చులు ప్రత్యేకించి ప్రభావవంతంగా పని చేస్తాయి
  • తపస్ పసుపు బంక ఉచ్చులు @ ఎకరానికి 6-8 ఉచ్చులు గులాబీ పంటలో పెనుబంకను సమర్థవంతంగా నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.

జీవసంబంధమైన చర్యలు:

  • పరాన్నభుక్కులు – పెనుబంక ఉదృతుని నియంత్రించడానికి లేడీబగ్‌లు మరియు లేస్‌వింగ్‌లను విడుదల చేయవచ్చు. ఈ పరాన్నభుక్కులు పెనుబంకను  తింటాయి మరియు వాటి సంఖ్యను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
  • బధనికలు – కందిరీగలు పెనుబంక జనాభాను నియంత్రించడంలో సహాయపడతాయి. కందిరీగలు పెనుబంక లోపల గుడ్లు పెడతాయి, ఈ ప్రక్రియలో వాటిని చంపుతాయి.
  • కాత్యాయనీ యాక్టివేటెడ్ వేపనూనె బయో పురుగు మందు యాక్టివేటెడ్ అజాడిరాక్టిన్ ఉంటుంది, దీనిని లీటరు నీటికి 5మి. లి చొప్పున  12 రోజుల వ్యవదిలో పిచికారి చేయడం ద్వారా గులాబీ పంటలో పెనుబంకను  సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
  • అమృత్ అలెస్ట్రా లిక్విడ్ (బయో పురుగు మందు ) సహజంగా సంభవించే ఎంటొమోపాథోజెనిక్ ఫంగస్ వెర్టిసిలియం లెకాని యొక్క జాతులను కలిగి ఉంటుంది, ఇది పెనుబంక యొక్క క్యూటికల్‌తో సంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు వాటిని చేరిపివేస్తుంది . సిఫార్సు చేయబడిన మోతాదు లీటరు నీటికి 2మి. లి .

రసాయనిక చర్యలు:

ఇతర నియంత్రణ చర్యలు ప్రభావవంతంగా లేనప్పుడు రసాయన నియంత్రణ చర్యలు తీసుకోవాలి. గులాబీ పంటలలో అఫిడ్స్‌ను నియంత్రించడానికి సాధారణంగా ఉపయోగించే కొన్ని వాణిజ్య రసాయనాలు క్రింది ఉన్నాయి :

ఉత్పత్తి పేరు సాంకేతిక విషయం మోతాదు
కాన్ఫిడార్ పురుగు మందు ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL 0.75 – 1 మి. లి /లీటరు నీటికి
ఆక్టారా పురుగు మందు థయామెథోక్సమ్ 25 % WG 0.5 గ్రా. /లీటరు నీటికి
అన్షుల్ ఐకాన్ పురుగు మందు ఎసిటామిప్రిడ్ 20% SP 0.5 గ్రా. /లీటర్ నీటికి
టఫగోర్ పురుగుమందు డైమీతోయేట్ 30%EC 1.5-2.5 మి. లి /లీటర్ నీటికి
అసటాఫ్ పురుగు మందు ఎసిఫేట్ 75% స్పెషల్ 1 – 1.5 గ్రా./లీటరు నీటికి

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023