భారతదేశం బ్రెజిల్ తర్వాత రెండవ అతిపెద్ద చెఱకు ఉత్పత్తిదారుగా ఉంది. 2021లో ఉత్తరప్రదేశ్ ఒక్కటే 177 మిలియన్ టన్నుల చెఱకు పండించింది.చెఱకు బహుముఖ పంట అయినందు వలన చెఱకును చక్కర, మొలాసిస్ మరియు పేపర్ తయారీలో కూడా వాడుతారు. చెఱకును ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో పండిస్తారు.
చెఱకును నాటడం అనేది వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత మరియు రకాల ఎంపిక ఆధారంగా జరుగుతుంది. ఈరోజు మార్కెట్ లో చెఱకును పండించడానికి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధిమైన రకాలు భీమా, నయనా, రసీలి, గంధక్, ప్రమోద్, హర్యానా, రాజభోగ్, రాసభారీ, శ్యామ మరియు శ్వేత. మార్కెట్ లో దొరికే చెఱకు రకాలలో నయనా చాలా తీయగా ఉంటుంది, ఈ రకం యొక్క రసంలో 20.1% చక్కెర శాతం(సుక్రోజ్) ఉంది. నయనా దిగుబడి దాదాపుగా హెక్టారుకు 104 టన్నులు వస్తుంది. నయన స్మట్ కు, ఎఱ్ఱ కుళ్ళు తెగులుకు మరియు కరువు నిరోధకతను కలిగి ఉంటుంది. కళ్యాణి, స్మట్ కు మరియు ఎఱ్ఱ కుళ్ళు తెగులుకు నిరోధకతగా పనిచేస్తుంది అలాగే కరువు మరియు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
చెఱకు విత్తన శుద్ధి అనేది, సాధ్యమైనంత వరకు విత్తనం వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి చేస్తారు. చెఱకుపై ఉన్న పొడి ఆకులను తొలగించడం ద్వారా ఇది ప్రారంభమవుతుంది. 7-8 నెలల చెఱకును మూడు కళ్ళ ముచ్చెలుగా 30 నుండి 40 సెం.మి పొడవుతో కత్తిరించుకోవాలి. ఈ కత్తిరించిన చెఱకు విత్తనాలను 0.1% కార్బండజిమ్ ( 1గ్రా./ లీటర్ నీటికి) 0.5% ద్రావణం లో లేదా ఆరెటన్ మరియు ఆగాల్లోల్ @4గ్రా. / లీటర్ నీటికి, నాటక ముందు 10 నిమిషాలు ముంచి పెట్టాలి. వేడి గాలి (50° సెల్సియస్ ఉష్ణోగ్రతలో 2 -2.5 గంటలు) ద్వారా కూడా విత్తన శుద్ధి చేయవచ్చును. ఇది చెఱకులో విత్తన శుద్ధికి ఉపయోగించగల ప్రభావంతమైన విత్తన శుద్ధి పద్దతి. విత్తనం ద్వారా వ్యాపించే రోగకారకాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
చెఱకు పొలాలను 50-60 సె.మీ లోతులో 2 నుండి 4 సార్లు డిస్క్ నాగలితో దున్నడం జరుగుతుంది. భూమిని 12-15 సెం.మీ లోతులో దున్నుకొని డిస్క్ హారో లేదా రోటవేటర్ ద్వారా గడ్డలను పగలకొట్టాలి. ఇది గట్టిగ ఉన్న మట్టిని పొడిగా మరియు సున్నితంగా చేస్తుంది. నీటి పారుదలకు అనుగుణంగా ఉండేలా, భూమిని సమానంగా చదును చేయాలి. చదును చేయడానికి ట్రాక్టర్ సహాయంతో వినియోగించగల లెవెలింగ్ యంత్రంను ఉపయోగించవచ్చు.
హెక్టారుకు 12.5 టన్నులు పశువుల ఎరవును లేదా 37.5 టన్నుల ప్రెస్ మడ్ ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత చెఱకు చెత్త మరియు ప్రెస్ మడ్ ను 1:1లో వేసుకోవాలి. వీటి తర్వాత రాక్ ఫాస్ఫేట్, జిప్సం మరియు యూరియ 2:2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తేమ కోసం ఆవు పేడ లేదా నీటితో కలపవచ్చును. భాస్వరం లేని నేలలో పంట వేసుకున్న సందర్భంలో హెక్టారుకు 37.5 కిలోలు సూపర్ ఫాస్ఫేట్‌ను చేతితో సాళ్లలో వేయండి. ఒకవేళ జింక్ (zn) మరియు ఇనుము (Fe) పోషకలోపం ఉన్న మట్టిలో పంట వేసుకున్న సందర్భంలో హెక్టారుకు 37.5 కేజీల జింక్ సల్ఫేట్ మరియు 100 కేజీలు ఫెరస్ సల్ఫేట్ వేసుకోవాలి. చెఱకు విత్తనాలను 30-45 సె.మీ సాళ్లలో నాటుతారు. నాటిన కణుపులకు 3 లేదా 4వ రోజున నీటిని అందించాలి.
మంచి నీటి-ప్రసరణ గల మేరక భూములు, మధ్యస్థ ఉదజని సూచిక లేదా తక్కువ లవణాలు గల నేలలు అనుకూలమైనవి (ఉదజని సూచిక 6.5 నుండి 7.5).
చెఱకు, దేశంలో అన్ని ప్రాంతాలలో పండించడం జరుగుతుంది. నీటి అవసరాన్ని పక్కన పెడితే, చెఱకు చాలా సులభంగా నిర్వహించదగిన పంట. అధిక నిర్వహణ అవసరం లేని, మంచి రాబడినిచ్చే డిమాండ్ ఉన్న పంట.
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…
చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…
పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…
జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…
మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…