Crop

టోస్పో వైరస్ నుండి టమాట పంటని రక్షించడానికి సులువైన మార్గాలు

మన దేశంలో టమాట పంటను ఆశించే ప్రధాన తెగుళ్లలో  స్పాటెడ్ విల్ట్ ఒకటి. ఇది టోస్పోవైరస్ వల్ల వస్తుంది. ఇది మొక్క యొక్క వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది మరియు ప్రతి భాగం విభిన్న లక్షణాన్ని కూడా చూపుతుంది. ఈ తెగులు మొక్క ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది, ఉత్పత్తిని దెబ్బతీస్తుంది లేదా మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

లక్షణాలు:

టమాట ఆకులపై టోస్పోవైరస్, లేత పసుపు లేదా గోధుమ రంగు శిలీంద్ర మచ్చలతో మరియు చిన్న పరిమాణంలో కనిపిస్తాయి. ఏర్పడిన పండ్లు రంగు కోలుపోయి, వాటి పైన పసుపు రంగు వలయం వలే వృత్తాలు ఏర్పడి పండు యొక్క ఆకారం మారిపోతుంది. ఇవన్నీ మార్కెట్‌లో ఉత్పత్తి ధరపై ప్రభావం చూపడం వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది.

రసాయన నియంత్రణ:

  • పెర్ఫెక్ట్ హెర్బల్ క్రాప్ హెల్త్ ఎన్‌హాన్సర్‌ను ఉపయోగించడం వలన టమాట మొక్కలలో టోస్పోవైరస్ సంక్రమణను నివారించవచ్చు. ఇది వివిధ ఔషధ మొక్కల సారాలతో తయారు చేయబడిన ప్రో-క్యూరేటివ్ ముందస్తు వ్యాధి నియంత్రణ కలిగిన ఉత్పతి. ఇది వైరస్, బాక్టీరియా, శిలీంధ్రాలు మొదలైన వాటి వల్ల కలిగే సంక్రమణలను నివారిస్తుంది మరియు కీటకాలు మరియు తెగుళ్ల సంక్రమణని కూడా నిరోధించగలదు. మొక్కలకు ఈ సమగ్ర పోషణ పర్యావరణానికి పూర్తిగా సురక్షితం. ఈ ద్రవాన్ని 1 మి.లీ., లీటరు నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
  • వాంప్రోజ్ వి-బైండ్ వైరిసైడ్ అనేది మొక్కలలోని వివిధ వైరస్ సంక్రమణల నుండి నివారణ మరియు నియంత్రణ ఉండే సహజ మొక్కల సారాల మిశ్రమం. ఇది కేవలం మొక్కల పదార్దాలు మరియు ముఖ్యమైన నూనెలతో తయారు చేయబడింది. ఈ ఫార్ములాలోని క్రియాశీల పదార్థాలు ప్రభావిత మొక్కలలోకి ప్రవేశించి సూక్ష్మజీవులను కప్పివేస్తాయి మరియు వాటిని తొలగిస్తాయి. ఇది మొక్క లోపల వైరస్‌ల వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తాయి. 2-3 మి.లీ. మిశ్రమాన్ని ఒక లీటరు నీటిలో కరిగించి వాడుకున్నట్లైతే చాలా ఉపయోగం ఉంటుంది.
  • మల్టీప్లెక్స్ మాగ్నమ్ Mn మొక్కలకు అవసరమైన మాంగనీస్‌ను కలిగి ఉంటుంది. ఇది 12% మాంగనీస్‌ను దాని చీలేటెడ్ రూపాల్లో కలిగి ఉంటుంది, ఇవి మొక్కలకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ పోషకం ఇతర పోషక అయాన్లను బదిలీ చేయడంలో సహాయపడుతుంది. ఇది పొడి రూపంలో లభిస్తుంది. ఒక లీటరు నీటిలో 0.5 గ్రా కలపండి మరియు ఆకులపై, ఎగువ మరియు దిగువ ఉపరితలాలపై పిచికారీ చేయండి.
  • మల్టీప్లెక్స్ క్రాంతి సూక్ష్మపోషక ఎరువులు మొక్కల రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రాథమిక, ద్వితీయ మరియు సూక్ష్మపోషకాలతో నిండిన పూర్తి మొక్కల ఆహారం. ఇది మొక్కలను వైరస్ వ్యాధుల నుంచి నిరోధకతను కలిగిస్తుంది మరియు పర్యావరణ ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

ముగింపు

సరైన నియంత్రణ కోసం ఈ ఉత్పత్తులను మీరు కొన్ని వారాల పాటు, ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించాలి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. పంటలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని పొందడానికి మా వెబ్‌సైట్ https://kisanvedika.bighaat.com/te/ ని సందర్శించండి లేదా మా టోల్ ఫ్రీ నంబర్ 1800 3000 2434కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

గమనిక:

ఇక్కడ ఉన్న సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇక్కడ ఏదీ ఆర్థిక లేదా న్యాయ సలహాగా భావించబడదు. పురుగుమందుల వల్ల పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది మరియు వీక్షకులు ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు వారి స్వంత పరిశోధన చేయాలని సూచిస్తున్నాము.

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023