Crop

పుచ్చ పంట సాగు కోసం నేల తయారీ విధానం

పుచ్చకాయ కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. 2020-21వ సంవత్సరంలో, భారతదేశం దాదాపు 31 మిలియన్ టన్నుల పుచ్చకాయలను పండించడం జరిగింది. భారతదేశంలో అగ్ర పుచ్చకాయ ఉత్పత్తిదారులు – ఉత్తర్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,  ఒర్రిసా, వెస్ట్ బెంగాల్, మధ్య ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర మరియు జార్ఖండ్.

రకాల ఎంపిక

    వివిధ రకాల పుచ్చకాయలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, అవి వివిధ రంగులలో ఉంటాయి, విత్తనాలు ఉండే రకాలు, విత్తనాలు లేని రకాలు మరియు వివిధ పరిమాణాలు మరియు ఆకారాలలో ఉన్నాయి. అర్క మాణిక్, దుర్గాపూర్ కేసర్, అర్క జ్యోతి, స్పెషల్ నెంబర్ 1, అసహి యమాటో, షుగర్ బేబీ, మాధురి 64, బ్లాక్ మేజిక్, ఇంప్రూవ్డ్ షిప్పర్, పూస బేధన, దుర్గపుర, మీత, వరుణ్, విమాల్, లేఖ, బ్లక్ థండర్, అర్క ఆకాష్, సువర్ణిమ మరియు అర్క ముత్తు మొదలైనవి ప్రసిద్ధి పొందిన రకాలు .

విత్తన శుద్ధి

         పుచ్చకాయ విత్తనాలను ట్రైకోడెర్మా విరిడి (4 గ్రా /కేజీ విత్తనాలకు) లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ (10 గ్రా / కేజీ విత్తనాలకు) లేదా కార్బెండజిమ్ తో (2 గ్రా /కేజీ విత్తనాలకు) విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేయడం ద్వారా మట్టి నుండి ఆశించే శిలీంధ్ర తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.

పుచ్చకాయ సాగు కోసం నారుమాడి తయారీ

       పుచ్చకాయ నారుమడిని, 10 సెం.మీ వ్యాసం మరియు 15 సెం.మీ ఎత్తులో  200 గేజ్ పాలిథిన్ సంచులతో లేదా రక్షిత-నర్సరీ కింద ప్రో- ట్రేస్ లో తయారు చేసుకోవాలి.  పాలిథిన్ సంచులలో నారును తయారు చేసుకునేటప్పుడు సంచులలో 1:1:1 నిష్పత్తితో ఎర్ర మట్టి, ఇసుక మరియు పశువుల ఎరువుతో కలుపుకోవాలి. నారును పెంచడం కోసం 98 కణాలు ఉన్న ట్రేలను ఉపయోగించుకోవాలి. 15 రోజులు ఉన్న మొలకలను ప్రధాన పొలంలో నాటుకోవాలి.

పుచ్చకాయ సాగు కోసం ప్రధాన పొలం తయారీ విధానం

     నేల పొడిగా అయ్యేంత వరకు దున్నుకోవాలి. దున్నిన తర్వాత, హెక్టరుకు 20 టన్నుల పశువుల ఎరువు, 5 కేజీల అజోస్పైరిల్లం, 5 కేజీల ఫాస్ఫో బాక్టీరియ, 5 కేజీలు సూడోమోనస్ మరియు 100 కేజీల వేప పిండితో కలిపి చివరి దుక్కిలో వేసుకోవాలి. విత్తడానికి 1.2 మీ. వెడల్పు మరియు 30 సెంటీమీటర్ల ఎత్తుతో సమతుల మడులను తయారు చేసుకోవాలి. మొలకలని కనీసం 6 అంగుళాల దూరంలో నాటుకోవాలి మరియు కాలువల మధ్య దూరం కనీసం 2.5 మీటర్లు ఉండాలి. ప్రతి మడికి బిందు సేద్యం (డ్రిప్) ద్వారా నీరు అందేలాగా ఏర్పాటు చేసుకోవాలి.

పుచ్చకాయ పంటకు అనువైన నేలలు

 పుచ్చకాయ ఇసుక నేలలో,  నీరు నిల్వని నేలలో బాగా పండుతుంది. 6.5 -7.5 ఉదజని సూచిక ఉన్న నేలలు శ్రేష్టమైనవి. 

శీర్షిక :

పుచ్చకాయ ఇతర తీగజాతి పంటలలా కాకుండా, ఒక మధ్యస్థ పంట. జనవరి-ఫిబ్రవరిలో పుచ్చకాయను విత్తడం వల్ల వేసవి నెలల్లో పంట చేతికి రావడంతో పాటు, అధిక ధర లభిస్తుంది.

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023