సాధారణంగా తామర పురుగు మరియు నల్లి మిరప పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగించే పురుగులు. పంట దిగుబడి మరియు నాణ్యతను కాపాడటానికి ఈ పురుగుల నుండి పంటను రక్షించడం చాలా ముఖ్యం. ఇవి మిరప పంటను మొలక దశ నుండి పునరుత్పత్తి దశ వరకు పంటను ఆశించడం జరుగుతుంది. వివిధ రకాల నల్లి పురుగులలో, పసుపు నల్లి పంటకు ఎక్కువ హాని కలిగిస్తుంది. తామర పురుగు మరియు నల్లి యొక్క రెండు దశలు (రెక్కల పురుగు దశ మరియు పిల్ల పురుగు దశ), మిరప పంట ఆకులు, కొమ్మలు, మొగ్గలు మరియు పండ్ల నుండి రసాన్ని పీల్చి నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలలో ఆకు ముడత లక్షణాలు గమనించవచ్చు.
నల్లి పురుగులు వేడి మరియు పొడి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పూత మరియా కాయ ఏర్పడే దశలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అయితే, తామర పురుగులు మాత్రం మొక్క ఎదిగే దశలో (శాకీయ దశలో) ఆశించడం వలన మొక్కలలో ఏర్పడే సగటు కాయల సంఖ్య మరియు కాయ పరిమాణం తగ్గడం గమనించవచ్చు. తామర పురుగు మరియు నల్లి మిరపలో 20% నుండి 50% వరకు దిగుబడిలో నష్టాన్ని కలిగిస్తాయి మరియు ఉదృతి ఎక్కువ ఉన్నపుడు 60 – 90% వరకు కూడా పంట నష్టం కలగవచ్చు. మిరపలో ‘లీఫ్ కర్ల్ వైరస్’ వ్యాప్తికి త్తామర పురుగు మరియు పురుగులు కూడా వాహకాలుగా పనిచేస్తాయి. ఈ పురుగులను తొలి దశలోనే నియంత్రించకపోతే పంట మొత్తం నాశనం అవుతుంది.
తామర పురుగు యొక్క శాస్త్రీయ నామం: స్కిర్టోత్రిప్స్ దోర్సాలిస్
ETL (ఆర్థిక నష్ట పరిమిత స్థాయి) : 6 తామర పురుగులు /ఆకు లేదా 10% దెబ్బతిన్న పంట
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం | మోతాదు (ప్రతి లీటరు నీటికి) |
మెకానికల్ నిర్వహణ | ||
బారిక్స్ మ్యాజిక్ స్టిక్కర్ క్రోమాటిక్ ట్రాప్ బ్లూ షీట్ | క్రోమాటిక్ ట్రాప్ | 8-10 అట్టలు /ఎకరాకు |
టపాస్ ఎల్లో స్టిక్కీ ట్రాప్ | 22 సెం.మీ x 28 సెం.మీ | 6 –8 అట్టలు /ఎకరాకు |
జీవ నియంత్రణ పద్ధతి | ||
కేబీ త్రిప్స్ రేజ్ క్రిమిసంహారక | బొటానికల్ ఎక్స్‌ట్రాక్ట్‌లు | 1-2 మి.లీ/లీటర్ నీటికి |
ఎకో నీమ్ ప్లస్ | అజాడిరాక్టిన్ 10000 పిపిఎమ్ | 3 మి.లీ/లీటర్ నీటికి |
నియంత్రణ TRM బయో-పెస్టిసైడ్ | బొటానికల్ ఎక్స్‌ట్రాక్ట్‌లు మరియు ఆల్కలాయిడ్‌ల సేంద్రీయ మిశ్రమం | 1.5 – 2 మి.లీ/లీటర్ నీటికి |
రసాయన నిర్వహణ | ||
అక్టరా | థయామెథాక్సామ్ 25 % WG | 0.5 గ్రా / లీటర్ నీటికి |
డెలిగేట్ | స్పైనేటోరం 11.7% SC | 0.9 మి.లి. / లీటర్ నీటికి |
అలాంటో | తైయక్లోప్రిడ్ 21.7% SC | 1-2 మి.లి. / లీటర్ నీటికి |
బెనివియ | సయంత్రానిలిప్రోల్ 10.26%OD | 1.7 నుండి 2.0 మి.లి / లీటర్ నీటికి |
ఎక్సపోనుస్ | బ్రోఫ్లనిలైడ్ 300 G/L SC | 0.2 మి. లి / లీటర్ నీటికి |
ట్రేసర్ | స్పినోసాడ్ 44.03% SC | 0.3-0.4 మి.లి /లీటర్ నీటికి |
E M 1 | ఏమమెక్టిన్ బెంజోయేట్ 5%SG | 0.4 గ్రా /లీటర్ నీటికి |
టకాఫ్ | డైఫెన్తైయూరోన్ 47%+ బైఫెంత్రిన్ 9.4% SC | 1.25-1.5 మి.లి / లీటర్ నీటికి |
కాత్యాయనీ IMD -178 | ఇమిడాక్లోప్రిడ్ 17.8%SL | 0.5 మి.లి / లీటర్ నీటికి |
మొవేంటో | స్పిరోటెట్రామాట్ 15.31%OD | 2 మి.లి / లీటర్ నీటికి |
ప్రైమ్ గోల్డ్ | అసెటామాప్రిడ్ 20%SP | 0.1-0.2 గ్రా / లీటర్ నీటికి |
శింజన్ ప్లస్ | ఫిప్రోనిల్ 5%SC | 1.6-2 మి.లి / లీటర్ నీటికి |
గోద్రెజ్ గ్రేసియ | ఫ్లక్సామెటమైడ్ 10%EC | 1 మి.లి / లీటర్ నీటికి లేదా 160 మి.లి / ఎకరానికి |
ధనుక డిసైడ్ | ఎటోఫెన్‌ప్రోస్ 6%+ డైఫీంతినురోన్ 25%WG | 2.5 మి.లి / లీటర్ నీటికి |
తామర పురుగు గురించి మరింత తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి – మరిన్ని లాభాలు పొందడం కోసం మిరపలో బ్లాక్ త్రిప్స్‌ను ఎలా అరికట్టాలి ?
గమనిక: పంటలో ఒకేసారి నల్లి మరియు త్రిప్స్ రెండూ సోకినట్లయితే ట్రేసర్ పురుగు మందు (స్పినోసాడ్) పిచికారీ చేయకూడదు.
పసుపు నల్లి పురుగు శాస్త్రీయ నామం: పాలీఫాగోటార్సోనెమస్ లాటస్
ETL (ఆర్థిక నష్ట పరిమిత స్థాయి) : 5-10 నల్లి పురుగులు/ఆకు
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం | మోతాదు (ప్రతి లీటరు నీటికి) |
జీవ నిర్వహణ | ||
ఎకో నీమ్ బయోపురుగుమందు | అజాడిరాక్టిన్ 3000 PPM | 2.5- 3 మి.లి / లీటర్ నీటికి |
R నల్లి బయో అకారిసైడ్ | ప్లాంట్ ఎక్సట్రాక్ట్స్ | 1-2మి.లి / లీటర్ నీటికి |
టెర్ర మైట్ | హెర్బల్ ఫార్ములాషన్ | 3-7మి.లి /లీటర్ నీటికి |
గ్రీన్ పీస్ నీమ్ ఆయిల్ (10000PPM ) బయో నీమ్ ఆయిల్ క్రిమిసంహారిని | నీమ్ ఆయిల్ ఎక్సట్రాక్ట్స్ (అజార్డిరాక్టిన్) | 1-2 మి.లి /లీటర్ నీటికి |
నీమ్ – అజాడిరాక్టిన్ 1500 PPM(0.15%)EC | అజార్డిరాక్టిన్ 1500 PPM (0.5%)EC | 2-2.5 మి.లి /లీటర్ నీటికి |
రసాయన నిర్వహణ | ||
ఓబెరన్ | స్పైరొమేసిఫిన్ 22.9% SC | 0.3 మి.లి /లీటర్ నీటికి |
మైడెన్ | హెక్సిథియాజోక్స్ 5.45% EC | 0.8-1 మి.లి /లీటర్ నీటికి |
EMA గోల్డ్ | ఏమమేక్టిన్ బెంజోయేట్ 5% SG | 0.5 గ్రా. /లీటర్ నీటికి |
షోకు | డైఫెన్తైయూరోన్ 50 WP | 0.8-1.2 గ్రా. /లీటర్ నీటికి |
గోద్రెజ్ హనబి | పైరిడబెన్ 20% WP | 1 గ్రా./లీటర్ నీటికి |
సెడ్నా | ఫెంపీరాక్సీమేట్ 5%SC | 1-1.5 మి..లి /లీటర్ నీటికి |
ప్లాటీస్ | భూప్రొఫెనజైన్ 25SC | 0.5-1.2 మి.లి /లీటర్ నీటికి |
ఇంట్రెపిడ్ | క్లోర్ఫెనాపైర్ 10%SC | 1.5-2 మి..లి /లీటర్ నీటికి |
కునోంచి | సైయెనోపీరాఫెన్ 30%SC | 0.5-0.6 మి.లి /లీటర్ నీటికి |
కీఫన్ | టోల్ఫీన్ పైరాడ్ 15%EC | 2 మి.లి /లీటర్ నీటికి |
ఓమైట్ | ప్రోపర్ గైట్ 57% EC | 3 మి.లి /లీటర్ నీటికి |
మీథ్రిన్ | ఫెన్‌ప్రోపాత్రిన్ 30% EC | 0.5 మి.లి /లీటర్ నీటికి |
మేజిస్టర్ | ఫెనాజాక్విన్ 10%EC | 2 మి.లి /లీటర్ నీటికి |
మిరప పంటకు నష్టాన్ని కలిగించే చీడపీడీలలో, తమర పురుగులు మరియు నల్లి పురుగులు చాలా ముఖ్యమైనవి. మిరపపంట యొక్క దిగుబడి మరియు నాణ్యతను పెంచడానికి, వ్యాప్తిని తగ్గించడానికి మరియు తెగుళ్ళ నష్టం యొక్క ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి ఈ చీడపీడీలను సమర్థవంతంగా నివారించడం చాలా ముఖ్యం. సమగ్ర సస్య రక్షణ చర్యలను అవలంబించడం వల్ల వాటి జనాభాను తగ్గించి మిరప పంటలలో ఈ చీడపీడీల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…
చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…
పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…
జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…
మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…