News

భారతదేశంలో మొదటిసారిగా, FSSAI బాస్మతి బియ్యం కోసం నియంత్రణ ప్రమాణాలను నిర్దేశించింది

ఆహారం మరియు భద్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి FSSAI ద్వారా బాస్మతి బియ్యం కోసం గుర్తింపు ప్రమాణాలు పేర్కొనబడ్డాయి. ఈ మొట్టమొదటి సవరణ నిబంధనలు గెజిట్ ఇండియాలో తెలియజేయబడ్డాయి మరియు ఆగస్టు 1, 2O23 నుండి అమలులోకి రానున్నాయి.

ఈ సవరణలు వినియోగదారుల ఆసక్తిని రక్షించడానికి మరియు బాస్మతి బియ్యం రకాన్ని బట్టి అసలైన సువాసనను కలిగి ఉండేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సవరణ కింద వచ్చే బాస్మతి బియ్యం రకాలు బ్రౌన్ బాస్మతి రైస్, మిల్లింగ్ బాస్మతి రైస్, పార్బాయిల్డ్ బ్రౌన్ బాస్మతి రైస్ మరియు మిల్లింగ్ పార్బాయిల్డ్ బాస్మతి రైస్.

బాస్మతి బియ్యం యొక్క కొత్త ప్రమాణాలు:

  1. బాస్మతి బియ్యం సహజ సువాసన లక్షణాన్ని కలిగి ఉండాలి
  2. కృత్రిమ రంగులు, సానబెట్టే పదార్ధాలు మరియు కృత్రిమ సువాసనలు లేకుండా ఉండాలి
  3. గుర్తింపు మరియు నాణ్యత పరమితులలో ధాన్యాల సగటు పరిమాణం మరియు వంట తర్వాత వాటి పొడుగు నిష్పత్తి, తేమ యొక్క గరిష్ట విలువలు, అమైలోజ్ పరిమాణం, యూరిక్ యాసిడ్, లోపము చెందిన/పాడైన ధాన్యాలు మరియు ఇతర బాస్మతీ యేతర బియ్యం వంటివి ఉంటాయి.

బాస్మతి బియ్యం ప్రాముఖ్యత :

బాస్మతి బియ్యం అనేది భారతీయ ఉపఖండంలోని హిమాలయాల దిగువ ప్రాంతంలో పండించే నాణ్యమైన వరి రకం. ఇది ప్రతేక్యేకంగా ధాన్యం యొక్క పొడవు, మెత్తటి ఆకృతి, ప్రత్యేక వాసన మరియు రుచికి ప్రసిద్ధి. ఇది సాగు చేయబడే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల యొక్క వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు, వరిని పండించే పద్ధతి మరియు ప్రాసెసింగ్ కారణంగా దాని ప్రత్యేకతను పొందింది. ఇది దేశీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడే బియ్యం రకం. ప్రపంచ సరఫరాలో మూడింట రెండు వంతుల వాటా భారతదేశంలోనే ఉంది.

బాస్మతి బియ్యం పంజాబ్, హర్యానా, జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని నిర్దిష్ట ప్రాంతాలలో పండిస్తారు.

శీర్షిక :

అంతర్జాతీయంగా మరియు అంతర్గతంగా బాస్మతి బియ్యం స్థాయిని పెంచడంలో కొత్త సవరణ నియంత్రణ ఒక ముఖ్యమైన దశగా నిరూపించబడుతుంది.ఇది ఒకప్పుడు ప్రజల దృష్టిలో బాస్మతీ బియ్యం విలువను దిగజార్చడానికి చేసిన మోసాలను నిరోధిస్తుంది.

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023