జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయ (JNKVV) జబల్‌పూర్, రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వ విద్యాలయం, గ్వాలియర్ మరియు ఇక్రిశాట్ (ICRISAT), పటాన్‌చెరువు, హైదరాబాద్ వారి సహకారంతో పూసా సంస్థ అని కూడా పిలువబడే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) ‘పూసా JG 16’, అనే వంగడాని అభివృద్ధి చేసింది. ఇది కరువును తట్టుకునే మరియు అధిక దిగుబడినిచ్చే శనగ రకం.
ICC 4958 నుండి కరువును తట్టుకునే జన్యువును మాతృ రకమైన J.G.16లో ప్రవేశపెట్టడం ద్వారా పుసా JG 16 రకం జెనోమిక్ బ్రీడింగ్ పద్ధతిని ఉపయోగించి సృష్టించబడింది. శనగ పై అఖిల భారత సహకార పరిశోధన కార్యక్రమం ద్వారా ఈ రకం కరువు నిరోధకతను ధృవీకరించడానికి దేశవ్యాప్తంగా ఒక ప్రయోగం జరిగింది. వివిధ రకాల కరువు ఒత్తిడిలో ఈ వంగడం హెక్టారుకు 2 టన్నుల ఉత్పత్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంది; ఇది ఫ్యూసేరియం ఎండు తెగులు మరియు తక్కువ వృద్ధి వ్యాధికి నిరోధకతను కలిగి ఉంటుంది మరియు శీఘ్ర పరిపక్వత కాలం (110 రోజులు) కలిగి ఉంటుంది.
ఫ్యూసేరియం ఎండు తెగులు అనేది విస్తృతమైన మొక్కల వ్యాధి. ఇది మట్టిలో నివసించే శిలీంద్రం ఫ్యూసేరియం ఆక్సిస్పోరమ్ ద్వారా వస్తుంది. చిలగడదుంపలు, టమాటాలు, బీన్స్, పుచ్చకాయలు, అరటి (పనామా ఎండు తెగులు అని పిలుస్తారు) మరియు అనేక ఇతర పంటలు అనగా వాణిజ్యపరంగా ముఖ్యమైన ఆహార పంటలతో సహా వృక్ష జాతులు ఈ ఎండు తెగులు భారిన పడతాయి. ఫ్యూసేరియం ఆక్సిస్పోరమ్ సజీవ అతిధేయ మొక్కతో సంబంధం లేకుండా మట్టిలో నిరవధికంగా జీవించగలదు మరియు 24 °C (75 °F) కంటే ఎక్కువ నేల ఉష్ణోగ్రతల వద్ద వృద్ధి చెందుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…
చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…
పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…
జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…
మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…