News

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ అఫ్ అగ్రికల్చర్ (USDA)చే ఆమోదించబడిన తేనెటీగ యొక్క ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి వ్యతిరేకంగా పని చేసే ప్రపంచంలోని మొట్ట మొదటి టీకా

తేనెటీగలలోని పెనిబాసిల్లస్ లార్వా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ప్రాణాంతక అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ USDAచే ఆమోదించబడింది. ఇది ప్రపంచంలోని మొట్ట మొదటి వ్యాక్సిన్ (లభ్యత ఈ సంవత్సరం నుండి ఉంటుందని అంచనా) మరియు USలోని వాణిజ్య తేనెటీగల పెంపకందారులకు (పరిమిత ప్రాతిపదికన) సరఫరా చేయబడుతుంది.

వ్యాక్సిన్ పని చేయు విధానం:

వ్యాక్సిన్‌లో పెనిబాసిల్లస్ యొక్క చంపబడిన కణం ఉంటుంది. టీకాను  కూలి ఈగలు తినే రాణి ఆహారంతో కలుపుతారు, మరియు ఇది రాజాహరంగా కలిసిపోతుంది. ఈ రాజాహారాన్ని కూలి ఈగలు రాణికి తినిపిస్తాయి మరియు అది దానిని తీసుకున్న తర్వాత, వ్యాక్సిన్ యొక్క కణాలు రాణి ఈగ అండాశయాలలో స్థిరపడతాయి. ఇది అభివృద్ధి చెందుతున్న లార్వాలను పొదిగినప్పుడు ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.

ఫౌల్‌బ్రూడ్ వ్యాధి అమెరికా దేశంలో ఉద్భవించింది మరియు ఇది ప్రపంచ వ్యాధిగా మారింది. ఇది ఒక అంటు వ్యాధి మరియు ఇప్పటి  వరకు ఎటువంటి నివారణ లేదు. ఈ వ్యాధి బారిన పడినప్పుడల్లా తేనెటీగల పెంపకందారులు దానిని కాల్చడం మరియు వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి సమీపంలోని కాలనీలకు యాంటీబయాటిక్స్ అందించడం ద్వారా నాశనం చేసేవారు. కానీ ఇప్పుడు, ఈ టీకా అమెరికాలోని తేనెటీగల పెంపకందారులందరికీ ఒక ఆశీర్వాదంగా నిరూపించబడుతుంది.

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023