భారతదేశంలో 300 వందల సంవత్సరాల నుండి ఆలుగడ్డను పండిస్తునారు. భారతదేశంలో 2021వ ఆర్ధిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ఒక్కటే 16 మిలియన్ టన్నుల ఆలుగడ్డలను పండించింది. 2019-2020 సంవత్సరంలో ఆలుగడ్డను ఎగుమతి చేయడం ద్వారా 5 బిలియన్ రూపాయిల ఆదాయం వచ్చింది. ఆలుగడ్డ గట్టి పంట, అందువలన ఏ ప్రాంతంలో అయిన పండించవచ్చును. ప్రధానంగా భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, బీహార్ మరియు అస్సాంలో ఎక్కువ పండిస్తుంటారు. బహుముఖ పంట కావడం వలన విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయవచ్చు, కాబట్టి ఆలుగడ్డకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.
విత్తనాల ఎంపిక :
ఆలుగడ్డలు మాములుగా విత్తన దుంపలను ఉపయోగించి విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. కుఫ్రి సింధురి, కుఫ్రి చంద్రముఖి, కుఫ్రి జ్యోతి, కుఫ్రి లావకర్, కుఫ్రి బాద్షాః, కుఫ్రి బహర్, కుఫ్రి లలిమ, కుఫ్రి జవహర్, కుఫ్రి సట్లేజ్, కుఫ్రి అశోక, కుఫ్రి పూఖరాజ్, కుఫ్రి చిప్సోనా మరియు కుఫ్రి ఆనంద్ లాంటి రకాలు ప్రజాదరణ పొందినవి. రస్సెట్, రౌండ్ వైట్, లాంగ్ వైట్, రౌండ్ రెడ్, పసుపు ఫ్లేష్, నీలం మరియు ఊదా అనేవి అన్యదేశ ఆలుగడ్డ రకాలు .
ఆలుగడ్డ విత్తన శుద్ధి :
ఆలుగడ్డ విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం ద్వారా వ్యాపించే నల్ల మచ్చలు, నల్ల కాడలు, ఎండు తెగుళ్లు మరియు ఆకు మాడు తెగులు నివారించవచ్చు. విత్తన దుంపలను మొత్తం దుంపను లేదా కోసిన అర్థ దుంపను కెప్టెన్ @2గా / లీటర్ నీటిలో శుద్ధి చేయాలి. దుంపను కోసిన 6 గంటల లోపల విత్తన శుద్ధి చేయాలి. హుమిక్ ఆమ్లము లో లేదా సేంద్రియ పెరుగుదల బూస్టర్ ను విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తన ఉత్పత్తికి మరియు మొక్క పెరుగుదలకు అవసరం అయిన ముఖ్యమైన పోషకాలును అందిస్తుంది.
ఆలుగడ్డ పంట నేల తయారీ :
ఆలుగడ్డ పంటకు అవసరమైన నేల రకం :
ఆలుగడ్డ పంట ఆమ్ల నేలలు మరియు ఉప్పు నేలలలో తప్ప, అన్ని నేలలలో పండుతాయి. సహజంగా మట్టి వదులుగా ఉండడం వలన దుంప పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మంచి సేంద్రియ పదార్థం, మంచి నీరు మరియు గాలి ప్రసరణ కలిగిన మట్టి నేలలు, ఇసుక మట్టి నేలలు ఆలుగడ్డ పండించడానికి ఉత్తమమైనవని చెప్పవచ్చును.
ఆలుగడ్డ పండించడానికి మట్టి ఉదజని సూచిక :
ఆలుగడ్డలు సాధారణంగా కొద్దిగా ఆమ్ల గుణం ఉన్న నేలలో బాగా పండుతుంది. 5.2 – 6.4 మధ్య ఉదజని సూచిక కలిగిన నేలలను ఎంచుకోవడం ఉత్తమం.
ఆలుగడ్డ పండించడానికి నేల తయారీ విధానం
నేలను 20-25 సెం.మి లోపలకు భూమిని దున్నుకోవాలి మరియు దున్నిన మట్టి ఎండకు బహిర్గతం కావాలి. మట్టిలో సూక్ష్మ రంధ్రాలు ఎక్కువగా ఉండడం వలన దుంప పెరుగుదలకు మరియు మొక్క పెరుగుదలను ఇది సహాయపడుతుంది. బాగా కుళ్ళిన పశువుల ఎరువు హెక్టరుకు 25-30 టన్నులు చివరి దుక్కిలో వేయాలి. 50-60 సెం.మి గల బోదెలను నాటక ముందు తయారు చేయాలి. దుంపను లేదా కోసిన అర్ధ దుంపను 15-20 సెం.మి ఎత్తు గల బోదెలో 5-7 సెం.మి లోతులో విత్తుకోవాలి. గుండ్రని రకాల సగటు విత్తన మోతాదు 1.5-1.8 టన్నులు ఒక హెక్టారుకు మరియు అండాకారంలో ఉన్న రకాలు 2-2.5 టన్నులు ఒక హెక్టారుకు వేసుకోవాలి.
నాలుగు వరుసల ఆలుగడ్డలు విత్తే యంత్రాన్ని ICAR వారు మార్కెట్లోకి విడుదల చేసారు, ఇది ఇటీవలి కాలంలో ఆలుగడ్డ రైతులలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని ఉపయోగించడానికి 2 లేదా 3 వ్యక్తులు అవసరం మరియు దీని ద్వారా 4 -5 హెక్టర్స్ ఒక రోజులో విత్తుకోవడం ద్వారా కూలి ఖర్చు గణనీయంగా తగ్గించవచ్చును.
సారాంశం :
ఆలుగడ్డ అనేది ప్రతిచోటా పండించగల గట్టి పంట. ఆలుగడ్డ మార్కెట్ లో ధరలు లేనప్పుడు విలువ జోడించినట్లైతే ఇది పెట్టుబడిపై మంచి రాబడిని ఇస్తుంది. ఇతర పంటల వలే కాకుండా ఆలుగడ్డ ఎప్పుడైనా, ఎక్కడైనా పండించవచ్చును.