ఆవాలు మూడు రకాలు ఉన్నాయి: గోధుమ రంగు, నలుపు మరియు తెలుపు. ఈ మూడు రకాలలో, నలుపు ఆవాలకు మంచి ప్రజాదరణ కలదు. 2020-21వ సంవత్సరంలో భారతదేశం 109.50 లక్షల టన్నుల ఆవాలను ఉత్పత్తి చేసింది. భారతదేశంలో రాజస్థాన్ ఆవాలు పండించడంలో మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా, గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్ ఆవాలు పండించడంలో మొదటి ఐదు స్థానాలలో ఉన్నాయి. భారతదేశంలో పండించే ఆవాలలో 60-65% దేశీయ డిమాండ్ నూనె వినియోగాలకి సంబందించినదె. 2020-2021వ సంవత్సరంలో మన దేశం యొక్క ఆవాల నూనె ఉత్పత్తి 13 మిలియన్ టన్నులు.
విత్తనాల ఎంపిక :
మార్కెట్ లో చాలా రకాల ఆవాలు ఉన్నాయి. NRCDR 02, NRCDR 601, NRCHB 101, DRMRIJ 31, DRMR 150-35, NRCYS 05-02, టోరియా, బ్రౌన్ సరోన్, వరుణ, శేఖర్, వైభవ్, వర్ధన్, రోహిణి, రోహని, క్రాంతి, కృష్ణ, వర్ధన్, వైభవ్, నరేంద్ర, రై -8501, కిరణ్, హయల PVC (9-22-1), రై వరుణ, T-36 (ఎల్లో), ITSA, సంగం, TL 15, భవాని, T-36, PT 303, PT 30, గౌరని (B54), 18-2-9, P T 507, D.K 1, మరియు T 9 ( నాలుపు ) వంటి రకాలు ఉన్నాయి.
ఆవాల విత్తన శుద్ధి :
ఆవాల విత్తనాలను థైరమ్(3 గ్రా/కేజీ విత్తనాలకు)తో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలను నీటిలో నానపెట్టి, 24 గంటలు వెలుతురు తగలని చోటున పెట్టుకోవాలి.
ఆవాల పంటకు నేల తయారీ విధానం :
ఆవాలను శీతాకాలంలో ఎక్కువ సాగు చేస్తారు. పొలంలో కలుపు మొక్కలు మరియు గడ్డలు లేకుండా చూసుకోవాలి. నేలని కనీసం 2 సార్లు అయినా దున్నుకోవాలి. ఒక ఎకరానికి 5-6 కేజీల విత్తనం సరిపోతుంది. ఆఖరి దుక్కిలో ఒక హెక్టారుకు 25 టన్నులు పశువుల ఎరువు వేసుకోవాలి. రెండు పద్ధతుల ద్వారా విత్తనాలను విత్తుకోవచ్చు, విత్తనాలను వెదజల్లే పద్దతి లేదా డ్రిల్లింగ్ పద్దతి. విత్తనాలను విత్తక ముందు పొలానికి నీరు పెట్టుకోవాలి. నేలకు 45 కేజీల నత్రజని, 35 భాస్వరం, 25 కేజీల పొటాషియం అందించాలి. పోషకాలన్నింటిని విత్తుకోవడానికి, కనీసం నాలుగు రోజుల ముందు వేసుకోవాలి.
ఆవాలు పండించడానికి అవసరమైన నేల రకాలు:
ఆవాలు వివిధ రకాల నేలల్లో పండించగల పంట. ఆవాలు ఇసుక నేలలు, నీరు నిల్వని నేలల్లో చాలా బాగా పండుతాయి. ఆవాలు మధ్య ఉదజని సూచిక (6.0 నుండి 7.5) ఉన్న నేలలో మరియు కొద్ది ఉప్పు నేలల్లో బాగా పండుతాయి.
శీర్షిక :
ఆవాలు మన దేశంలో పురాతన కాలం నుండి పండిస్తున్న పంట. సంప్రదాయ సాగులో ఉన్న పద్ధతులు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. ఆవాలు పండించడం చాలా సులభం. కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టే రైతులకు ఇది ఒక ఉత్తమమైన పంట. ఆవ నూనెకు, ఎల్లప్పుడూ అధిక డిమాండ్ ఉండడం వల్ల, ఈ పంటను సాగుచేయడంలో ఆసక్తి పెరిగింది.