HomeCropటమాట పంటకు నేల తయారీ విధానం

టమాట పంటకు నేల తయారీ విధానం

భారతదేశంలో దాదాపుగా 2000 పైగా టమాట రకాలు సాగులో ఉన్నాయి. టమాట ఉత్పత్తిలో   భారతదేశం 2వ స్థానంలో ఉంది. 2021వ సంవత్సరంలో భారతదేశం ఒక్కటే 20.33 మిలియన్ టన్నులు పండించింది. టమాట కూరగాయ కాదు, ఇది ఒక పండు మరియు బెర్రీగా వర్గీకరించబడింది. టమాట అనేది పొలం లేకున్నా, ఇంటి పక్కనే ఉండే చిన్న స్థలంలో కూడా పండించుకోగల పంట. ఇది అత్యంత జనాదరణ పొందిన తోట పంటలలో ఒకటి. టమాట కెచప్, జామ్, ఊరగాయ మరియు ఎండలో ఎండబెట్టడం వంటి విలువ జోడింపు కోసం కూడా ఉపయోగపడుతుంది.

విత్తనాల ఎంపిక :

ముందుగా పేర్కొన్న విధంగా టమాటలో ఎంచుకోవడానికి 2000 పైగా విత్తన రకాలు ఉన్నాయి. వైశాలి, రూపాలి, రష్మీ, రజని, పూస రూబీ, పూస ఎర్లీ ద్వార్ఫ్, పూస 120, కో 1, సిఔస్, బెస్ట్ అఫ్ అల్, మార్గలోబ్, రోమా, పంజాబ్ ట్రీంఫ్, కారోల్ చేకోస్ బిగ్ పేస్ట్, గ్రాండ్ మా మరిస్, బెల్లస్టర్, బిగ్ రెడ్ పేస్ట్, కెనడియన్ లాంగ్ రెడ్, డేనాలి, హంగేరియన్ ఇటలీయాన్, ఓరోమా, పాలేష్టినియన్, పీసంట్, పోలిష్ పేస్ట్, రెడ్ సౌసాజ్, రోమా, శాన్ మారజనో.

టమాట విత్తన శుద్ధి :

విత్తన అంకురోత్పత్తికి మరియు మంచి దిగుబడికి టమాట విత్తన శుద్ధి చాలా అవసరం. టమాట విత్తనాలను ట్రైకోడర్మా విరిడే 4 గ్రా./కేజీ విత్తనాలకు లేదా కార్బెండిజమ్ 2 గ్రా./కేజీ విత్తనాలకు, విత్తుకునే 24 గంటల ముందు విత్తన శుద్ధి చేయడం ద్వారా ప్రభావవంతంగా పనిచేస్తుంది అని నిరూపించబడినది.

టమాట నారు మడి తయారీ :

1 హెక్టారు విస్తీర్ణంలో టమాట ఉత్పత్తికి 3 సెంట్లు విస్తీర్ణం గల నేల సరిపోతుంది. తరువాత 50% షేడ్ నెట్ తో  నర్సరీను కప్పి ఉంచాలి మరియు నాలుగు వైపులా పురుగులను రానివ్వకుండ ఉంచే నెట్ తో కప్పాలి. 1 మీ వెడల్పు మరియు సౌకర్యవంతమైన పొడవుతో ఎత్తైన బెడ్లను తయారు చేసుకోవాలి. వర్షాకాలంలో అధిక వర్షం వల్ల చేరే నీటిని తీసేయడం కోసం, 2 మీటర్ల వ్యవధిలో HDPE పైపులను ఏర్పరుచుకోవాలి. క్రిమిరహిత కొబ్బరి పీచును 300 కేజీలు,  5 కేజీలు వేపపిండితో పాటు అజోస్పైరీల్లం మరియు ఫాస్ఫో బాక్టీరియా 1 కేజీను బాగా కలపాలి. ప్రో-ట్రే నింపడానికి కొబ్బరి పీచు అవసరం. ఒక హెక్టారు విస్తీర్ణంలో, జంట సాళ్ల పద్ధతిలో 90*60*60 సెంటీమీటర్ల  అంతరాన్ని అనుసరించి టమాట నాటుటకు కావాల్సిన 23,334 నారు మొలకల కోసం 238 ప్రో-ట్రేలు (92 కణాలు) అవసరం.

శుద్ధి చేసిన విత్తనాలని ప్రో-ట్రేలలో ఒక కణంలో ఒక విత్తనం వేయాలి. విత్తనాలను కొబ్బరి పీచుతో కప్పి, ట్రేలను ఒక దాని పైన ఒకటి ఉంచాలి మరియు అంకురోత్పత్తి వరకు ప్లాస్టిక్ కవరుతో కప్పివుంచాలి. ఆరు రోజుల తర్వాత  మొలకెత్తిన విత్తనాల ప్రో-ట్రేలను  పక్క పక్కన నర్సరీ బెడ్ పైన ఉంచాలి. రోజ్ క్యాన్ తో రోజు నీరు పెట్టాలి, NPK 19:19:19  0.5% ద్రావణంతో ( 5గ్రాములు / లీటర్ నీటికి) నాటిన 18 రోజుల తర్వాత తడపాలి.

టమాట పంటకు నేల తయారీ విధానం :

మట్టి వదులుగా అయ్యేలా దున్నండి. 25 టన్నుల పశువుల ఎరువు హెక్టరుకు, ఆఖరి దుక్కిలో వేసిన తరువాత 60 సెంటీమీటర్ల అంతరంతో బోదెలు మరియు కాలువలను చేయండి. దీని తరువాత హెక్టారుకు 2 కిలోల అజోస్పైరిల్లం మరియు 2 కిలోల ఫాస్ఫో బాక్టీరియాను 50 కిలోల ఎరువుతో కలిపి వేయాలి. మంచి నీటి యాజమాన్యం కోసం డ్రిప్ పైపులను ఏర్పరుచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే, పంటకు కావాల్సిన మొత్తం నీటి అవసరాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు. టమాట నారు నాటడానికి 5 రోజుల ముందు పెండిమిథాలిన్ 1.0 కేజీ/హెక్టరుకు లేదా ఫ్లూక్లోరాళిన్ 1.0 కేజీ/హెక్టరుకు కలుపు రాకముందు కలుపు నివారణకు పిచికారీ చేసుకోవాలి. తరువాత 28 రోజులు గల మొక్కలను నాటుకోవాలి. నాటిన 7 రోజుల తర్వాత వడలిపోయిన లేదా చనిపోయిన మొక్కల స్థానంలో వేరే వాటిని నాటుకోవాలి.

టమాట పంటకు అవసరమైన నేల రకాలు :

టమాట పంటకు సేంద్రీయ పదార్థం అధికంగా ఉండే నేల అనుకూలం. మధ్యస్థ ఉదజని సూచిక 6.5 నుండి 7.5 కలిగిన బంకమట్టి నేలలు మంచిది.

సారాంశం

భారతదేశ వ్యాప్తంగా టమాట పంట సాగు జరుగుతుంది. ఇది ఒక గట్టి పంట మరియు తక్కువ నిర్వహణ అవసరం.

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles