HomeCropవరి పంట నేల తయారీ విధానం

వరి పంట నేల తయారీ విధానం

2021-2022వ సంవత్సరంలో భారతదేశంలో కేవలం ఖరీఫ్ లో 111.76 టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద  బియ్యం ఉత్పత్తి చేస్తున్న దేశం. గత దశాబ్దం నుండి వరి ఉత్పత్తి నిలకడగా ఉంది. ఇతర వ్యవసాయ పంటల కంటే భారతదేశంలో వరి సాగులో అత్యధిక విస్తీర్ణం ఉంది. భారతదేశంలో ఇంచుమించు అన్ని ప్రాంతాలలో వరి సాగులో ఉంది.

విత్తనాల ఎంపిక :

10,000 కంటే ఎక్కువ రకాల వరి విత్తనాలు ఈ రోజు మార్కెట్ లో దొరుకుతున్నాయి. దేశంలో పండిస్తున్న ప్రధాన రకాలు బాస్మతి, జోహా, జ్యోతి, నవరా, పొన్ని, పూస, సోనా మసూరి, జయ, కళాజిరి (సువాసన బరితమైన ), బోలి, పలక్కడ  మట్ట, కట్టమొడన్, కైరాలి, జ్యోతే, భద్ర, ఆశ, కేరళ రక్తశాలి : ఎరుపు కావుని, కైవరా సాంబ, మాపిల్లాయి సాంబ, కురువికర్ మరియు తమిళనాడుకు చెందిన  పూంగర్. గత సంవత్సరంలోనే 800 వందలకు పైగా రకాలు ప్రవేశపెట్టారు.

విత్తనాలను ముందుగా నానబెట్టడం :

రెండు రకాలుగా విత్తనాలను నానపెట్టవచ్చు. విత్తనాలను, విత్తన ప్రైమింగ్  మరియు  ముందుగా నానపెట్టడం వంటి పద్ధతులు ఉన్నాయి. విత్తన ప్రైమింగ్ లో విత్తనాలను నాటక ముందు 4- 8 గంటలు నానపెట్టి తర్వాత వాటిని ఎండబెడతారు. వరిలో అంకురోత్పత్తికి ముందు వరి విత్తనాలను 12-24 గంటలు నీటిలో నానపెడుతారు.

వరి విత్తనాలకు విత్తనశుద్ధి

  • బయో వరి విత్తన శుద్ధి

వరి విత్తన శుద్ధి పద్ధతిని ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. విత్తన శుద్ధి కోసం సేంద్రియ మరియు అసేంద్రియ పద్ధతులు ఉన్నాయి. ఎక్కువ వాడుతున్న సేంద్రియ విత్తన శుద్ధి  పద్ధతి హెక్టారుకు 600 గ్రా అజోస్పైరిల్లం లేదా 1.2 కేజీ/హెక్టారుకు అజోఫోస్ వాడాలి. బయో ఇనొక్యులేషన్ పద్దతిలో నాటక ముందు సరిపడ నీటిలో రాత్రంతా విత్తనాలను నానపెట్టాలి. వరి సాగు కోసం జీవనియంత్రణ ఏజెంట్లు మరియు జీవ ఎరువులకు అనుకూలంగా ఉంటాయి, అందుకని జీవనియంత్రణ ఏజెంట్లును మరియు జీవ ఎరువులను కలిపి వాడవచ్చును. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్‌తో వరి విత్తన శుద్ధి, పౌడర్ ఆధారిత సూడోమోనాస్ 10/కేజీ విత్తనాలను 1 లీటర్ నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. మడిలో ఎక్కువ నీటిని తీసేసిన తరువాత మొలకెత్తడానికి 24 గంటలు సమయం ఇచ్చి, ఆ తరువాత విత్తుకోవాలి.

  • రసాయన మందులతో వరి విత్తన శుద్ధి

శిలీంద్ర సంహారిణులకు మరియు జీవనియంత్రణ ఏజెంట్లు కలిపి వాడదగినవి కావు. శీలింద్ర బెంలేట్ లేదా మాంకోజబ్ లేదా ఆరాజోన్ రెడ్ 3గ్రాములు లీటరు నీటికి వేసుకొని 1కేజీ విత్తనాలతో శుద్ధి చేయడం ద్వారా  విత్తనం ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. 1 కిలో విత్తనాలకు 2 గ్రా./లీ నీటికి కార్బెండజిమ్ లేదా పైరోక్విలాన్ లేదా ట్రైసైక్లోజోల్ ద్రావణాన్ని, ఇతర విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నియంత్రణకు ఉపయోగించవచ్చు. కార్బెండజిమ్ (బావిష్టన్) 1 కేజీ విత్తనాలకు 2 గ్రాములు/లీటరు నీటిలో కలుపుకొని విత్తన శుద్ధి చేయాలి.  తరువాత విత్తనాలను 10 గంటలు నీటిలో నానపెట్టి తరువాత అదనపు నీటిని తీసివేయాలి దీనిని తడి విత్తన శుద్ధి అని అంటారు. ఇలా చేయడం ద్వారా విత్తనాలను అగ్గి తెగులు నుండి 40 రోజులు వరకు కాపాడవచ్చును.  ఇలా విత్తన శుద్ధి చేసిన విత్తనాలను గోనెసంచిలో వేసి  చీకటి ప్రదేశాలలో  ఉంచి వాటిని కప్పి ఉంచాలి. విత్తనాలు మొలకెత్తడానికి 24 గంటలపాటు కదిలించకుండా ఉంచాలి.

వరి విత్తనాల కోసం నారు మడి తయారీ

వరి విత్తనాల కోసం చాలా రకాల నర్సరీ బెడ్ తయారీ పద్ధతులు వాడుకలో ఉన్నాయి. తడి నర్సరీలు కూడా ఉన్నాయి. విత్తన బెడ్ ల చుట్టూ 30 సెం.మీ వెడల్పు గల చానెళ్లతో   మరియు 2.5 మీటర్ల వెడల్పుతో చేయబడతాయి. నేల రకం మరియు వాలు ప్రకారం, నర్సరీ బెడ్ పొడవు మారవచ్చు.

నర్సరీకు సరిపడా నీరు మరియు నీటి పారుదల వ్యవస్థ కలిగి ఉండాలి. రెండు సార్లు దుక్కి దున్నుకొని 1 టన్  పశువుల ఎరువు వేయాలి. మళ్ళీ నర్సరీకి నీటిని పారించి దున్నండి. నీరు రెండు రోజులు నిల్వ ఉండాలి. ఇలాగే నీటిని ఉంచి, భూమిని కలియ దున్నాలి.

5-10 cm నీటిని ఉంచి, ఇనుప నాగలితో కలియదున్నాలి. వ్యతిరేక దిశలలో కలియదున్నడం ద్వారా మట్టి విరగడం మరియు నీటి వ్యవస్థ లోపలకు పోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలం లో డాపోజ్, మ్యాట్, ఎండు నర్సరీ విధానాలను వాడుతున్నారు.

వరి కోసం పొలం తయారు చేసే విధానం :

వరి సాగు విధానానికి నల్ల బంక మట్టి నేలలు సరిపోతాయి. నల్ల బంక మట్టి నేలలు, బంక మట్టి నేలలలో  వరి బాగా పండుతుంది.

మట్టి ఉదజని సూచిక : కొద్దిగా ఆమ్ల నేలలు అవసరం (ఉదజని సూచిక 6)

వరి పొలం తయారీ  (ప్రధాన పొలం)

వరి పొలానికి వరి నాటక ముందు, ఒకటి లేదా రెండు రోజుల ముందు నుండి నీరు పెట్టుకోవాలి. మంచి నేల తయారీ కోసం ఒకటి లేదా రెండు సార్లు దున్నుకోవాలి.  చివరిగా దున్నుతునప్పుడు హెక్టార్ కు 12.5 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ లేదా 6.25 టన్నుల పచ్చి రొట్ట ఎరువును  వేసుకోవాలి. నాటక ముందు హెక్టార్ కు 22 కేజీల యూరియా వేసుకోవాలి. నారు నాటుతున్నపుడు 2-2.5 cm నీరు ఉండేలా చూసుకోవాలి.

సారాంశం

వరి పంటకు సంరక్షణ మరియు నిర్వహణ చాలా అవసరం. ఇది పండించడానికి సులభమైన పంట కాదు. వరి దేశం యొక్క ప్రధాన ఆహార పంట, అందువలన బియ్యానికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles