HomeCropఉల్లి పంట కోసం నేల తయారీ విధానం

ఉల్లి పంట కోసం నేల తయారీ విధానం

భారతదేశం ఉల్లి పంట ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. భారతదేశపు ఉల్లి, గాటు తత్వానికి ప్రసిద్ధి. అందువలన భారతదేశపు ఉల్లికి డిమాండ్ ఎక్కువ. 2021-22 వ సంవత్సరం లో భారతదేశం 3,432.14 కోట్లు విలువైన 1,537,496.89 మెట్రిక్ టన్నులు గల ఉల్లిగడ్డలను ప్రపంచానికి ఎగుమతి చేసింది. బాంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఏమీరేట్స్, నేపాల్ మరియు ఇండోనేషియా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారతదేశంలో ప్రధానంగా  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు జార్ఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పండిస్తున్నారు.

విత్తనాల ఎంపిక :

ఉల్లి విత్తనాల ఎంపిక కోసం చాలా రకాలు ఉన్నాయి. అందులో  కో1, కో2, ఎమ్ డి యూ 1, అగ్రి ఫౌండ్ రోజ్, అర్క బిందు, భీమ శుభ్ర, భీమ శ్వేత, భీమ సఫేద్, పూస వైట్ రౌండ్, అర్క యోజిత్, పూస వైట్ ఫ్లాట్, ఉదయపూర్ 102, ఫూలే సఫేద్, N25791, అగ్రి ఫౌండ్ వైట్, ఫూలే సువర్ణ, అర్క నికేతన్, అర్క కీర్తిమాన్, భీమ సూపర్, భీమ రెడ్, పంజాబ్ సెలక్షన్, పూస రెడ్, N2-4-1,  పూస మాధవి, అర్క కళ్యాన్ మరియు అర్క లాలిమ.

ఉల్లి విత్తన శుద్ధి

ఉల్లి ఆకుపచ్చ కాడలను పూర్తిగా కోసి, తీసేయాలి. ఉల్లి గడ్డను బావిస్టీన్ లేదా డైతెన్ M45 @ 2 గ్రాములు/లీటర్ నీటిలో వేసి నాటక ముందు 5-10 నిమిషాలు నానపెట్టాలి. ఇలా చేయడం ద్వారా గడ్డలకు మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుండి కాపాడవచ్చు.

విత్తనాలు:

కేజీ విత్తనాలను 2 గ్రాముల థైరమ్ శిలింద్రనాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా ట్రైకొడెర్మా విరిడే @ 4 గ్రా/కేజీ విత్తనాలను శుద్ధి చేయడం ద్వారా నారు కుళ్ళును అదుపు చేయవచ్చును మరియు ఆరోగ్యకరమైన నారును పెంచవచ్చును.

ఉల్లి సాగు కోసం నారుమడి తయారీ :

ఒక హెక్టర్ విస్తీర్ణంలో ఉల్లి సాగు కోసం దాదాపుగా  4-5 కేజీల ఉల్లి విత్తనాలు అవసరం. నారుమడి తయారీ కోసం 6 నుండి 7 సెంట్ల నేల అవసరం. నేలను 5-6 సార్లు దున్నుకొని చెత్తను తీసివేయాలి. మట్టిలో 500 కేజీల పశువుల ఎరువును కలపాలి మరియు 10-15 సెంటీమీటర్ల ఎత్తు 1.2 మీటర్ల వెడల్పు గల బోదెలను చేసుకోవాలి. బోదెకి బోదెకి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాలను 50 మిల్లీమీటర్ల నుండి 75 మిల్లీమీటర్ల దూరంలో నాటుకోవాలి. తేలిక పాటి నీరు అందించాలి. ఖరీఫ్ లో అయితే విత్తిన 35-40 రోజుల నారు  మరియు ఖరీఫ్ చివరి భాగములో / రబిలో అయితే విత్తిన 45-50 రోజుల నారు, ప్రధాన పొలంలో నాటడానికి నారు సిద్ధమవుతుంది.

ఉల్లి నాటడానికి నేల తయారీ :

ఉల్లి సాగు కోసం నేలను 3 – 4 సార్లు దున్నుకోవాలి. చివరి దుక్కిలో 20 టన్నులు పశువుల ఎరువును వేసుకోవాలి.  20 సెంటీమీటర్ల దూరంతో బోదెలు మరియు కాలువలు తయారు చేసుకోవాలి. ఎరువులలో, యూరియా 26 కేజీలు, సింగల్ సూపర్ పాస్పేట్ (SSP) 144 కేజీలు మరియు పొటాష్ 19 కేజీలు నేలకు అందించాలి. శుద్ధి చేసిన విత్తనాలను లేదా నారును, నీరు పెట్టిన తర్వాత విత్తుకోవాలి / నాటుకోవాలి.

ఉల్లి సాగుకు  అవసరమైన నేల రకం :

దేశం మొత్తం ఉల్లిగడ్డను పండిస్తారు. అందువలన ఉల్లి ఏ నేలలో అయిన పండుతుంది. అయినప్పటికీ మెరక నేలలు లేదా నీరు నిలువని, సారవంతమైన బంక మట్టి నేలలు ఉల్లి సాగుకు అనుకూలంగ ఉంటాయి.

ఉల్లి ఉత్పత్తికి అవసరమైన మట్టి ఉదజని సూచిక :

మధ్యస్థ స్థితిలో ఉన్న ఉదజని సూచిక ఉన్న నేలలను ఎంచుకోవడం ఉత్తమం.

సారాంశం :

ఉల్లి గట్టి పంట కనుక ఎక్కడైనా పండించవచ్చు. ఉల్లి ఇతర పంటలలా కాకుండా చాలా రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. నిల్వ గుణం ఉన్నందువలన ఉల్లి పంటను ఏ కాలములో అయినా  (ఖరీఫ్ / రబీ / ఎండా కాలం) పండించుకొని, అనువైన ధర వచ్చిన తరువాత మార్కెట్లో అమ్ముకోవచ్చును.

 

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles