Crop

కాఫీ సాగుకు నేల తయారీ విధానం

భారతదేశం ఒక్క 2020-21వ సంవత్సరంలోనే 3.69 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో బ్రెజిల్, వియాత్నం, కొలంబియా, ఇండోనేషియ మరియు ఇథియోపియ ప్రపంచంలో  అతిపెద్ద కాఫీ ఉత్పత్తి దారులుగా ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా ఉంది. భారతదేశంలో కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు కాఫీ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులు. భారతదేశపు కాఫీ, రుచి కారణంగా బలమైన మిశ్రమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశపు కాఫీ, పండించిన మొత్తంలో 80% ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇటలీ, జర్మనీ, రష్యా, స్పెయిన్, బెల్జియం, స్లోవేనియా, యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ దేశాలకు భారతదేశం కాఫీని ఎగుమతి చేయడం జరుగుతుంది. అరబికా మరియు రోబస్టా వంటి రెండు రకాల కాఫీలను పండించడం జరుగుతుంది.

విత్తనాల ఎంపిక :

కాఫీలో ప్రధానంగా అరబికా మరియు రోబస్టా అను రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు రకాల ఆధారంగా తయారు చేసుకున్న ప్రముఖ హైబ్రిడ్ రకాలు వచ్చి కెంట్, S-795, కావేరి మరియు సెలెక్షన్ 9.

కాఫీ విత్తన శుద్ధి :

కాఫీ బీన్స్ నుండి కాఫీ విత్తనాలను ఉత్పత్తి చేయడం చాలా కష్టం కాబట్టి కాఫీ విత్తనాలను సాధారణంగా విశ్వసనీయ రిటైలర్ల నుండి కొనుగోలు చేస్తారు. కాఫీ విత్తనాలను అజోస్పైరిల్లమ్ మరియు పాస్పో బాక్టీరియాతో విత్తన శుద్ధి చేసుకోవాలి. కాఫీ విత్తనాల సున్నిత గుణం వలన ఎక్కువ రసాయనాలతో విత్తన శుద్ధి చేస్తే విత్తన అంకురోత్పత్తి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. కాఫీ పొట్టును లేదా విత్తన పొరను జాగ్రత్తగా తీసి విత్తనాలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణముతో కడగాలి. తరువాత విత్తనాలను త్వరగా, ఖనిజాలు లేని నీటితో ఏ రసాయన అవశేషాలు లేకుండా కడిగేసుకోవాలి. కడిగిన విత్తనాలను 48 గంటలు నానపెట్టాలి.

కాఫీ సాగు కోసం నారు మడి తయారీ విధానం

కాఫీ విత్తనాల నుండి కాఫీ మొక్కలను పొందడం చాలా కష్టం మరియు సమయం తీసుకుంటుంది. కాఫీ విత్తనాలు సున్నితమైనవి కాబట్టి, కాఫీ మొక్కలను సాధారణంగా కొనుగోలు చేసి నాటుతారు. కాఫీ మొక్కలను మాములుగా పాలితిన్ సంచులలో పెంచుతారు. మంచి పొడి మట్టి, వెర్మికులేట్ మరియు హ్యూమస్ మిశ్రమాన్ని కలిపి ఆ సంచులలో ఉంచాలి. విత్తనాలచే సాగు చేపట్టేప్పుడు, పైన చెప్పిన విధంగా సంచుల్లో అమర్చుకొని, ఒక్కో సంచిలో విత్తనాన్ని విత్తుకొని నీడ ప్రదేశంలో పెట్టుకోవాలి. విత్తనాలు మొలకెత్తడం కోసం 2.5 నెలల సమయం తీసుకుంటుంది. కాఫీ గింజలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి, అతి ఎక్కువ నీరు లేదా తక్కువ నీరు విత్తనాలను నాశనం చేస్తాయి.

కాఫీ సాగుకు ప్రధాన పొలం తయారీ విధానం :

పొలంలో కలుపు మొక్కలు, చెత్త లేకుండా శుభ్రంగా ఉండాలి. మెరుగైన నీటి నిర్వహణ కోసం పొలం వాలుగా ఉండాలి. పొలానికి ఏవైనా ఎరువులు వేసే ముందు మట్టి పరీక్ష చేయించడం చాలా ముఖ్యం. మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. హెక్టారుకు 5 టన్నుల చొప్పున పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేసుకోవడం తప్పనిసరి. కాఫీ మొక్కలను సాధారణంగా అప్పటికే సాగులో ఉన్న ఏదైనా నీడనిచ్చే  ఆగ్రోఫారెస్ట్రీ పంట యొక్క నీడలో నాటుకోవాలి. 

కాఫీ సాగుకు అవసరమైన నేలలు

కాఫీ సాధారణంగా నీరు నిలవని అధిక హ్యూమస్ శాతం కలిగి ఉన్న నేలల్లో, ఉదజని సూచిక 5 నుండి 6 వరకు ఉన్న నేలలో నాటడం జరుగుతుంది. కాఫీ నాటుకునే నేల ఆమ్ల తత్వాన్ని కలిగి ఉండాలి మరియు ఆ ఆమ్లగుణాన్ని కోల్పోకుండా చూసుకుంటూ ఉండాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్క సారి మట్టి పరీక్ష చేయించుకొని నేల యొక్క పోషక స్థాయిలను తెలుసుకుంటూ దానికి అనుగుణంగా నిర్వాహణ చర్యలు చేపట్టాలి.

శీర్షిక :

కాఫీ సాగు చాలా కష్టంతో కూడుకున్న పంట మరియు చాలా సున్నితమైనది.  అయితే మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగు చేస్తే రైతుకు పెట్టుబడిపై అధిక రాబడిని అందిస్తుంది. 

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023