Crop

ఆవాల పంట నేల తయారీ విధానం

ఆవాలు మూడు రకాలు ఉన్నాయి: గోధుమ రంగు, నలుపు మరియు తెలుపు. ఈ మూడు రకాలలో, నలుపు ఆవాలకు మంచి ప్రజాదరణ కలదు. 2020-21వ సంవత్సరంలో భారతదేశం 109.50 లక్షల టన్నుల ఆవాలను ఉత్పత్తి చేసింది. భారతదేశంలో రాజస్థాన్ ఆవాలు పండించడంలో మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా, గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్ ఆవాలు పండించడంలో మొదటి ఐదు స్థానాలలో ఉన్నాయి. భారతదేశంలో పండించే ఆవాలలో 60-65% దేశీయ డిమాండ్ నూనె వినియోగాలకి సంబందించినదె. 2020-2021వ సంవత్సరంలో మన దేశం యొక్క ఆవాల నూనె ఉత్పత్తి 13 మిలియన్ టన్నులు.

విత్తనాల ఎంపిక :

మార్కెట్ లో చాలా రకాల ఆవాలు ఉన్నాయి. NRCDR 02, NRCDR 601, NRCHB 101, DRMRIJ 31, DRMR 150-35, NRCYS 05-02, టోరియా, బ్రౌన్ సరోన్, వరుణ, శేఖర్, వైభవ్, వర్ధన్, రోహిణి, రోహని, క్రాంతి, కృష్ణ, వర్ధన్, వైభవ్, నరేంద్ర, రై -8501, కిరణ్, హయల PVC (9-22-1), రై వరుణ, T-36 (ఎల్లో), ITSA, సంగం, TL 15, భవాని, T-36, PT 303,  PT 30, గౌరని (B54), 18-2-9, P T 507, D.K 1, మరియు T 9 ( నాలుపు ) వంటి రకాలు ఉన్నాయి.

ఆవాల విత్తన శుద్ధి :

ఆవాల విత్తనాలను థైరమ్(3 గ్రా/కేజీ విత్తనాలకు)తో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలను నీటిలో నానపెట్టి, 24 గంటలు వెలుతురు తగలని చోటున పెట్టుకోవాలి.

ఆవాల పంటకు నేల తయారీ విధానం :

ఆవాలను శీతాకాలంలో ఎక్కువ సాగు చేస్తారు. పొలంలో కలుపు మొక్కలు మరియు గడ్డలు లేకుండా చూసుకోవాలి. నేలని కనీసం 2 సార్లు అయినా దున్నుకోవాలి. ఒక ఎకరానికి 5-6 కేజీల విత్తనం సరిపోతుంది. ఆఖరి దుక్కిలో ఒక హెక్టారుకు 25 టన్నులు పశువుల ఎరువు వేసుకోవాలి.  రెండు పద్ధతుల ద్వారా విత్తనాలను విత్తుకోవచ్చు, విత్తనాలను వెదజల్లే పద్దతి లేదా డ్రిల్లింగ్ పద్దతి. విత్తనాలను విత్తక ముందు పొలానికి నీరు పెట్టుకోవాలి. నేలకు 45 కేజీల నత్రజని, 35 భాస్వరం, 25 కేజీల పొటాషియం అందించాలి. పోషకాలన్నింటిని విత్తుకోవడానికి, కనీసం నాలుగు రోజుల ముందు వేసుకోవాలి. 

ఆవాలు పండించడానికి అవసరమైన నేల రకాలు:

ఆవాలు వివిధ రకాల నేలల్లో పండించగల పంట. ఆవాలు ఇసుక నేలలు, నీరు నిల్వని నేలల్లో చాలా బాగా పండుతాయి. ఆవాలు మధ్య ఉదజని సూచిక (6.0 నుండి 7.5) ఉన్న నేలలో మరియు కొద్ది ఉప్పు నేలల్లో బాగా పండుతాయి.

శీర్షిక :

ఆవాలు మన దేశంలో పురాతన కాలం నుండి పండిస్తున్న పంట. సంప్రదాయ సాగులో ఉన్న పద్ధతులు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. ఆవాలు పండించడం చాలా సులభం. కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టే రైతులకు ఇది ఒక ఉత్తమమైన పంట. ఆవ నూనెకు, ఎల్లప్పుడూ అధిక డిమాండ్ ఉండడం వల్ల, ఈ పంటను సాగుచేయడంలో ఆసక్తి పెరిగింది. 

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023