Crop

గులాబీ సాగుకు నేల తయారీ విధానం

భారతదేశం అతిపెద్ద పూల ఉత్పత్తిదారుల్లో ఒకటి. 2020-21సంవత్సరంలో భారతదేశం ఒక్కటే  771.41 కోట్లు విలువ చేసే 23,597.17 మెట్రిక్ టన్నుల పూల ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అదే సంవత్సరంలో దేశం 2.1 మిలియన్ టన్నుల వదులు పువ్వులు మరియు 0.8 మిలియన్ టన్నుల కట్ పువ్వులు ఎగుమతి చేసింది. భారతదేశంలో కర్ణాటక, వెస్ట్ బెంగల్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, అస్సాం మరియు తెలంగాణ ప్రధానంగా పువ్వులు సాగు చేస్తున్న రాష్ట్రాలు.

రకాల ఎంపిక :

మనం ఎంచుకోవడానికి వివిధ రంగులు, పరిమాణాలు, ఆకారాలు మరియు వివిధ కాలాలకు అనుకూలమైన రోజాలు అందుబాటులో ఉన్నాయి. గ్లాడియేటర్, బేబీ పింక్, సోఫియా లారెన్స్, YCD 1, YCD 2, YCD 3, ఏడ్వార్డ్ రోజ్, ఆంధ్ర రెడ్ గులాబీ మరియు బటన్ గులాబీ వంటి చాలా ప్రసిద్ధ రకాలు ఉన్నాయి.

వివిధ రకాల కట్ గులాబీలు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం గులాబీలను సాగు చేస్తారు.

గులాబీ ప్రవర్థన పద్ధతి మరియు విత్తన శుద్ధి :

గులాబీలను కొమ్మ కత్తిరింపుల ద్వారా లేదా బడ్డింగ్ ద్వారా శాకీయ పద్ధతిలో ప్రవర్థనం చేస్తారు. గులాబీ మొక్కల నుండి కత్తిరించబడిన చిన్న ముక్కల ద్వారా పెంచడం జరుగుతుంది. ఇవి తల్లి చెట్టు నుండి కొమ్మలు, రెమ్మలు మరియు చెట్టులోని ఏ ఇతర భాగాల నుండి అయిన కావచ్చు.  కత్తిరించిన కొమ్మలలో రెండు లేదా మూడు కనులు ఉండేలా చూసుకోవాలి. కొమ్మలను కత్తిరించిన వైపును IBA లేదా IAA 500 PPM లో ముంచి శుద్ధి చేసిన తర్వాత నాటుకోవాలి.

గులాబీ సాగుకు నారు తయారీ విధానం

గులాబీలను సాధారణంగా నర్సరీ బ్యాగ్‌లలో పెంచుతారు. సంచులలో పాటింగ్ మిక్స్, పశువుల ఎరువు మరియు 6:12:12 గ్రాముల NPKతో నింపాలి. నాటిన ఒక నెల నుండి వేర్లు పెరగడం ప్రారంభం అవుతాయి.  వేర్లు వచ్చిన కొమ్మలను ప్రధాన పొలంలో నాటుకోవాలి.

గులాబీ సాగుకు నేల తయారీ విధానం

భూమిని బాగా దున్నుకొని, 45 సెం మి x 45 సెం.మి x 45 సెం.మి గుంతలను, 2.0 x 1.0 మీటర్ల అంతరంలో చేసుకోవాలి. పశువుల ఎరువుతో కలుపుకున్న అజోస్పైరిల్లమ్ మరియు పాస్పోబాక్టీరియా మిశ్రమాన్ని ఒక గుంతకు 10 కేజీలు గులాబీ మొక్కలు నాటక ముందు వేసుకోవాలి.

గులాబీ సాగుకు అనువైన నేల రకాలు

మంచి నీటి ప్రసరణ గల తేలిక నేలలు గులాబీ సాగుకు అనుకూలం. నీరు నిలుపుకొనే లేదా బరువైన నీరు ఇంకని నేలలు గులాబీ సాగుకు అనుకూలం కాదు.

శీర్షిక

గులాబీల సాగు చాలా సున్నితత్వంతో కూడిన పంట. గులాబీల సాగుకు కచ్చితమైన పోషక యాజమాన్య పద్ధతులను పాటించడం అవసరం. గులాబీలు వివిధ రంగులు, పరిమాణాలు మరియు వివిధ ఆకారాలలో వస్తాయి. 

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023