Crop

తేయాకు సాగు కోసం నేల తయారీ విధానం

భారతదేశం, తేయాకు ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వాతావరణం, తేయాకు సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. 2020-21 సంవత్సరంలో భారతదేశం 27, మిలియన్ టన్నుల తేయాకును ఉత్పత్తి చేసింది. భారతదేశం, ప్రపంచం లో తేయాకు వినియోగం లో 3  స్థానంలో ఉంది. విశిష్టమైన రుచిని కలిగి ఉండే వివిధ తేయాకు రకాలు ఉన్నాయి మరియు ఈ తేయాకుకి, పండించే ప్రదేశాలకు పేరు పెట్టడం జరిగింది. అస్సాం, డార్జిలింగ్ మరియు దూర్స్, కొన్ని విశిష్టమైన తేయాకు రకాలు. ఇరాన్, యూఏఈ,యు ఎస్ ఏ, పొలాండ్, కెనడా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, సింగపూర్, శ్రీ లంక, కెన్యా, జపాన్, పాకిస్తాన్ మరియు ఆస్ట్రేలియా, భారతదేశం యొక్క ప్రధాన ఎగుమతి గమ్యస్థాన దేశాలు.

రకాల ఎంపిక

వివిధ దేశాలకు చెందిన వివిధ రకాలు, ప్రతి సంవత్సరం మార్కెట్‌ను ముంచెత్తుతూ ఉంటాయి. అయితే కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన రకాలు కొన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. పండియన్, సుందరం, గోల్కొండ, జయరాం, ఎవెరగ్రీన్, ఐతేయ్, బ్రూకేలెండ్, BSS1, BSS 2, BSS 3, BSS 4, మరియు BSS 5. వంటివి కొన్ని ప్రసిద్ధ రకాలు.

తెయాకుతేయాకు ప్రవర్ధన పదార్ధ తయారీ

తేయాకు పంటను అంటు కట్టడం మరియు క్లిప్పింగ్ ద్వారా పెంచుతారు. మాములుగా కొమ్మ కతకత్తిరింపులను వేసవి ప్రారంభంలో (ఏప్రిల్ – మే) చేస్తారు. ఈ సమయంలో కత్తిరింపులు చేపట్టడం వలన, తల్లి మొక్క ఒత్తిడి నుండి కోలుకోవడానికి తగిన పరిస్థితులను కలిగి ఉంటుంది మరియు అంటుకట్టుట స్థిరీకరించడానికి అనుకూలమైన పరిస్థితులను కలిగి ఉంటుంది..తేయాకు కొమ్మ కత్తిరింపులను/కత్తిరించిన భాగాలను, నాచుతో పాటు కలిపి పెట్టినట్లయితే, తొందరగా ఒత్తిడి నుండి కోలుకొని అంటు కట్టుకోడానికి సిద్ధమవుతుంది.

తేయాకు నారుమడి తయారీ విధానం

తేయాకు నారుమడిని నీడ ఉండే ప్రాంతంలో లేదా షేడ్ నెట్ల కింద తయారు చేసుకోవాలి. అంటుకట్టిన మొక్కలకు, గాలిలో సరైన తేమను అందించడానికి మరియు నియంత్రించడానికి ప్లాస్టిక్ షీటుతో చిన్న గుడారం లాగా ఏర్పాటు చేసు. అంటు కట్టిన కొమ్మలు పెరుగుదలకు తేలిక పాటి సంచులలో పొటాష్, మెగ్నీషియం సల్ఫేట్ మరియు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. అలానే ఇసుక, పొడి మట్టి, కంపోస్ట్ మిశ్రమాన్ని 1:1:3 నిష్పత్తితో సంచులను నింపుకోవాలి.

తేయాకు సాగు కోసం నేల తయారీ విధానం

కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని, ఏటవాలుగా ఉండే నేలను కొంతవరకు సమం చేసుకోవాలి..భూమిని రెండు సార్లు కలియ దున్ని హెక్టారుకు 100 కేజీల రాక్ ఫాస్ఫేట్,  నత్రజని ,మరియు పోపొటాష్ 2:3 నిష్పత్తితో ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తేయాకు తోటల సాగు ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే చేయడం వలన ఎక్కువగా ఎరువులను వాడారు. అంటుకట్టిన 90-100 రోజుల తర్వాత మొక్కకు వేరువ్యవస్థ మొదలవడం ప్రారంభం అవుతుంది.మొక్కలను వాటితో ఉన్న మట్టితో పాటు ప్రధాన పొలంలో నాటుకోవాలి. తేయాకును ఒక వరుస కంచె లాగ లేదా రెండు వరుసల కంచె లాగ నాటుకుంటారు.

తేయాకు సాగుకు అనువైన నేలలు

తేయాకు సాగుకు అధిక సేంద్రియ పదార్థంతో ఉన్న,  4.5 నుండి 5.5 ఉదజని సూచిక గల ఆమ్ల నేలలు అనువైనవి. సముద్ర మట్టం నుండి 1000-2500 మీటర్ల ఎత్తులో అద్భుతంగా సాగు అవుతుంది.

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023