Crop

ద్రాక్ష సాగుకు నేల తయారీ విధానం

భారతదేశం 2021వ సంవత్సరంలో 2,302.16 కోట్లు విలువ గల 2,63,075.67 మెట్రిక్ టన్నుల  ద్రాక్షను ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయడం జరిగింది. భారతదేశం యొక్క ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, రష్యా, యుకె, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు జర్మనీ. ప్రపంచంలో ద్రాక్ష పండిస్తున్న దేశాలలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. భారతదేశం ప్రధానంగా తినడం కోసం ద్రాక్షను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు మిజోరం రాష్ట్రాలలో పండిస్తారు. ద్రాక్ష సాధారణంగా వేడి మరియు పొడి వాతావరణ పరిస్థితులలో సాగు చేయబడుతుంది. 

రకాల ఎంపిక

నాలుగు రకాల ద్రాక్షలు ఉన్నాయి: తెలుపు మరియు ఎరుపు అనేవి రెండు రకాలు, విత్తనాలు కలిగినవి మరియు లేనివి మరొక రెండు రకాలు. బెంగళూరు బ్లూ, గులాబీ, బ్యూటీ సీడ్ లెస్ మరియు శరద్  సీడ్ లెస్, అనబ్-ఈ- షాహీ, దిల్ కుష్, పేర్లేట్టే, పూస సీడ్ లెస్, తొంపిసోన్ సీడ్ లెస్, టాస్ -ఏ -గణేష్, సోనాక, మస్కట్, పచ్చద్రాక్ష, అర్క శ్యామ్, అర్క కాంచన్, అర్క హన్స్, మాణిక్ చామన్, సోనాక, ఫ్లామే సీడ్ లెస్ మరియు మాణిక్ చామన్ అనేవి ప్రజాదరణ పొందిన కొన్ని రకాలు.

ద్రాక్ష ప్రవర్ధన భాగాల విత్తన శుద్ధి

ద్రాక్ష సాధారణంగా అంటుకట్టే పద్దతి ద్వారా  మరియు కత్తిరించిన కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేయబడుతుంది. కత్తిరించిన కొమ్మలను, థైరమ్(3 గ్రా. /లీటర్) కలిపిన నీటిలో ముంచుకొని శుద్ధి చేసుకోవాలి  మరియు శుద్ధి చేసిన కొమ్మలను పాలిథిన్ సంచులలో నాటుకోవాలి. తరువాత వాటిని నీడ ప్రదేశాలలో ఉంచుకోవాలి.

ద్రాక్ష సాగుకు నేల తయారీ విధానం

భూమిని సాధారణంగా మూడు నుండి నాలుగు సార్లు దున్నుకోవాలి. ట్రాక్టర్ సహాయంతో  ప్రధాన పొలాన్ని చదును చేసుకోవాలి. తరువాత విస్తృత రకాలు అయినటువంటి  అనబ్ -ఈ -షాహీ  మరియు బెంగళూరు బ్లూ వంటి రకాలకు 1.2 మీ. x 1.2 మీ. విస్తీర్ణంతో  గుంతలు తీసుకోవాలి మరియు  చిన్న రకాలు అయినటువంటి తొంప్సన్ సీడ్ లెస్, పేర్లేట్టే మరియు బ్యూటీ సీడ్ లెస్ రకాలకు 90సెం.మీ x 90సెం.మీ గల చిన్న గుంతలు చేసుకోవాలి. మొదటి సారిగా 5-10 టన్నుల పశువుల ఎరువు / పేడ లేదా 5-10 కేజీల పశువుల ఎరువు / పేడ, 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల భాస్వరం మరియు 300 గ్రాముల పోటాష్ ప్రతి మొక్కకు వేసుకోవాలి.

ద్రాక్ష సాగుకు అనువైన నేల రకాలు

ద్రాక్ష పొడి వాతావరణ పరిస్థితులతో పెరుగుతుంది. కాబట్టి నీరు నిలుపుకోని, మంచి నీటి ప్రసరణ గల సారవంతమైన పొడి నేలలు, ద్రాక్ష సాగుకు శ్రేష్టమైనవి. 6.5 నుండి 7.0 ఉదజని సూచిక ఉన్న నేలలు అనుకూలం.

శీర్షిక

ద్రాక్షను నాటిన తర్వాత సరైన సమయంలో కత్తిరింపులు చేపట్టాలి. ద్రాక్ష సాగు కష్టంతో కూడుకున్న పంట అయినప్పటికీ, భారతదేశంలో పెరుగుతున్న ద్రాక్ష ఉత్పత్తికి అనుగుణంగానే, ప్రపంచ దేశాలలో ద్రాక్షకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది. అందువల్ల ద్రాక్ష అనేది, భవిష్యత్తులో కచ్చితమైన నికర లాభం ఇచ్చే పంటగా పరిగణించబడుతుంది. 

Recent Posts

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…

March 19, 2024

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP)

చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…

March 7, 2024

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం

పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…

March 6, 2024

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం)

జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…

October 25, 2023

ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (MOVCDNER)

మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…

September 20, 2023

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…

September 20, 2023