HomeCropsCrop Managementవరి పంటను ఆశించే తెగుళ్లు, వాటి యాజమాన్యం

వరి పంటను ఆశించే తెగుళ్లు, వాటి యాజమాన్యం

భారత దేశంలో ఆహార ధాన్యా పంటల సాగు విస్తరణంలో 1/4వ వంతు విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబడుతుంది. చాలా వరకు ప్రపంచ దేశాలలో వరిని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. వరి ఉత్పత్తిలో చైనా తర్వాత భారత దేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశం 2022-23 సంత్సరంలో 125 టన్నుల వరిని ఉత్పత్తి చేయడం జరిగింది. 2022-23 సంవత్సరంలో  మొత్తం 45.5 మిలియన్ హెక్టర్ల విస్తరణంలో పండించగా హెక్టార్ కు  సగటున 4.1 టన్నుల ఉత్పత్తి రావడం జరిగింది. భారత దేశంలో వరి ఎక్కుగా కరిఫ్ కాలంలో  పండిస్తారు. తేమ మరియు వేడి వాతవరణంలో, ఉష్ణ మండలం మరియు ఉప ఉష్ణ మండలంలో బాగా పెరుగుతుంది.

వరిలో ముఖ్యమైన తెగులు

  • అగ్గి తెగులు :

తెగులు కారకం: పైరికులేరియా ఒరైజె (లైంగిక దశ : మాగ్నాపోర్తే గ్రిసియా)

తెగులు ఆశించే దశలు: అన్ని దశలలో పైరును ఆశిస్తుంది. 

వరిని ఆశించే తెగుళ్లలో ఇది ఒక ప్రమాదకరమైన తెగులు. ఈ తెగులు వారి యొక్క ఆకులు, మెడ భాగం, కణుపులు మరియు చివరి భాగాలను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వలన 70-80% వరకు పంట నష్టం కలిగే అవకాశము ఉంది.

లక్షణాలు :

  • ఆకు పైన – కుదురు ఆకారంతో మధ్యలో బూడిద రంగు మరియు అంచులు గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. తరువాత మొత్తం కాలిపోయిన ఆకు లాగా కనిపించడం జరుగుతుంది.
  • మెడ భాగం పైన – గోధుమ రంగు గాయాలు మరియు కొమ్మలు విరిగి కిందకి పడిపోవడం జరుగుతుంది.
  • కణుపుల పైన – తెగులు సోకిన కనుపులు నల్లటి గాయాలుగా కనిపించడం జరుగుతుంది.

వరిలో అగ్గి తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

దీర్ఘకాలంగా లేదా తరచుగా వర్షాలు, నేలలో సరిపడా తేమ ఉండకపోవడం, తక్కువ ఉష్ణోగ్రత గాలిలో 93-99% వరకు తేమ ఉన్న ప్రాంతాలలో ఈ తెగులు ఎక్కువ  వచ్చే అవకాశం ఉంది.

వాడుకోదగిన రసాయనాలు

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
కాంటాఫ్ హెక్సాకోనజోల్ 5 % EC
నేటివో టెబుకోనజోల్ 50%+ ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 25% WG
ధనుకా కాసు-బి కాసుగామైసిన్ 3% SL
ఫోలిక్యూర్   టెబుకోనజోల్ 250 EC
  • బాక్టీరియా ఆకు మచ్చ తెగులు :

తెగులు కారకం: జాన్తోమోనాస్ ఒరైజా 

తెగులు ఆశించే దశలు: పిలక దశ నుండి పొట్ట దశ వరకు

లక్షణాలు:

  • ఆకులపై మచ్చలు క్రమంగా ఒక దానితో ఒకటి కలిసి పేద మచ్చగా ఏర్పడుతుంది మరియు ఆకుల చివరి నుండి అడుగు భాగం వరకు తెల్లటి చారలు ఏర్పడతాయి.
  • ఆకులు వాడిపోవడం మరియు పసుపు రంగులోకి మారడం గమనించవచ్చు.
  • సాధారణంగా ‘ నారు వడలు తెగులు’    అని లేదా ‘క్రెసెక్’ అని పిలుస్తారు.

బాక్టీరియల్ ఆకు మచ్చలు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

నీటిని అందించి మరియు లోతట్టు ప్రాంతంలో వర్షాధారంగా సాగుచేసే పంటలో ఎక్కువగా గమనించవచ్చు. 25 – 34°C ఉష్ణోగ్రత, 70% పైన గాలిలో తేమ శాతం, అధిక నత్రజని, బలమైన గాలులు మరియు నిరంతర వర్షపాతం తెగులు సోకడానికి అనుకూలమైన పరిస్థితులు.

వాడుకోదగిన రసాయనాలు:  

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
బ్లూ కాపర్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP
క్రిస్టోసైక్లిన్ స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 90% + టెట్రాసిలిన్ హైడ్రోక్లోరైడ్ 10% SP
జియోలైఫ్ జియోమైసిన్ కన్సార్టియం ఆఫ్ ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్స్
కొనికా కసుగమైసిన్ 5% +  ఆక్సిక్లోరైడ్ 45% WP
  1. పొట్ట కుళ్ళు :

తెగులు కారకం: సరోక్లాడియం ఒరైజా

తెగులు ఆశించే దశలు : పోటాకు దశ

లక్షణాలు:

  • ఆకుల పై గోధుమ రంగులో కనిపించడం జరుగుతుంది
  • తెగులు ఆశించిన ఆకు లోపల తెల్లటి పొడి శిలీంధ్రాలుగా కనిపిస్తుంది.

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

పొడి వాతావరణ పరిస్థుతలతొ పోలిస్తే, తడిగా ఉండే వాతావరణ పరిస్థుతలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అధిక నత్రజని వాడటం , గాయాలు మరియు దెబ్బలు కలిగిన మొక్కలు, అధిక తేమ మరియు 20-28°డిగ్రీల గల ఉష్ణోగ్రత, అధిక సాంద్రతలో నాటుకోవడం ఈ తెగులు ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు.

వాడుకోదగిన రసాయనాలు:  

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
ధనుస్టిన్ కార్బెండజిమ్ 50% WP
కవాచ్  క్లోరోథలోనిల్ 75% WP
టాటా మాస్టర్ మెటాలాక్సిల్ 8% + మాంకోజెబ్ 64% WP
కొనికా కసుగామైసిన్ 5%  +కాపర్ ఆక్సిక్లోరైడ్
  1. గోధుమ రంగు మచ్చ తెగులు :

తెగులు కారకం: హెల్మింతోస్పోరియం ఒరైజా

తెగులు ఆశించే దశలు: మొలక దశ నుండి పాలకంకి దశ వరకు

లక్షణాలు

  • పసుపు వర్ణంతో గుండ్రటి లేదా స్థూపాకార ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకులపైనా ఏర్పడతాయి
  • ఈ తెగులు సోకిన పువ్వులు గింజగ మారినప్పుడు పూర్తిగా నిండకుండా తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంటుంది మరియు గింజ యొక్క నాణ్యత తగ్గిపోతుంది.

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

గాలిలో తేమ శాతం 86 – 100%, ఉష్ణోగ్రత 16 – 36°డిగ్రీలు, తెగులు సోకిన విత్తనాలు, కలుపు మొక్కలు, తెగులు సోకిన పంట వ్యర్ధాలు తెగులు సంక్రమణకు అనుకూలమైన కొన్ని పరిస్థితులు.

వాడుకోదగిన రసాయనాలు: 

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
టిల్ట్ ప్రొపికోనజోల్ 25% EC
కాంటాఫ్ ప్లస్ హెక్సాకోనజోల్ 5 % SC
మెర్జెర్  ట్రైసైక్లాజోల్ 18 % + మాంకోజెబ్ 62 % WP
గోడివా సూపర్  అజోక్సిస్ట్రోబిన్ 18.2% + డైఫెనోకోనజోల్ 18.2% SC
  1. మాని పండు లేదా కాటుక తెగులు:

తెగులు కారకం: ఉస్టిలాజినోయిడియా విరెన్స్

 తెగులు ఆశించే దశలు: పూత దశ నుండి పంట చివరి దశ వరకు

లక్షణాలు:

  • తెగులు సోకిన గింజలు నారింజ లేదా ఆకుపచ్చని నలుపు రంగు మెత్తని ముద్దల వలే ఏర్పడతాయి
  • తాలు గింజలు ఏర్పడతాయి

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

25-35°డిగ్రీల ఉష్ణోగ్రత, 90% కంటే ఎక్కువ గాలిలో తేమ, అధిక నత్రజని వాడకం, వేగంగా వీచే గాలులు మరియు అధిక వర్షపాతం ఈ తెగులు సోకడానికి సహకరించే పరిస్థితులు.

 వాడుకోదగిన రసాయనాలు :

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
అమిస్టార్ టాప్ అజోక్సిస్ట్రోబిన్ 18.2% + డైఫెనోకోనజోల్ 11.4% SC
రోకో థియోఫనేట్ మిథైల్ 70% WP
కస్టోడియా అజోక్సిస్ట్రోబిన్ 11% + టెబుకోనజోల్ 18.3%
బి కంట్రోల్ వాలిడమైసిన్ 3% L
  1. పాము పొడ తెగులు

తెగులు కారకం: రైజోక్టోనియా సోలాని

 తెగులు ఆశించే దశలు: పిలక దశ నుండి కంకి ఏర్పడే దశ వరకు

లక్షణాలు:

  • ప్రారంభంలో, నీటి మట్టం దగ్గర ఆకుల పై ఆకుపచ్చని బూడిద రంగు గుండ్రటి ఆకారంలో లేదా దీర్ఘవృత్తాకార గాయాలు కనిపిస్తాయి
  • తరువాత, ఇవి బూడిదరంగు తెలుపు మధ్యభాగం మరియు గోధుమ అంచు మచ్చలుగా తయారవుతాయి. 

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

వర్షాకాలంలో తెగులు వ్యాప్తి చాలా అధికంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, అధిక నత్రజని వాడడం, దగ్గరగా నాటడం పాము పొడ తెగులకు అనుకూలమైన పరిస్థితులు.

 వాడుకోదగిన రసాయనాలు :

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
ఫోలిక్యూర్ టెబుకోనజోల్ 250 EC
కస్టోడియా అజోక్సిస్ట్రోబిన్ 11%  +టెబుకోనజోల్ 18.3% SC
బావిస్టిన్ కార్బెండజిమ్ 50% WP
టాటా అయాన్ క్రెసోక్సిమ్-మెథైల్ఎక్స్40%
  1. టుంగ్రో వైరస్ తెగులు:

తెగులు కారకం: రైస్ టుంగ్రో  వైరస్ – RTV (RTSV & RTBV)

తెగులు ఆశించే దశలు: అన్ని దశలలో ముఖ్యంగా షాకీయ దశలో ఆశించడం జరుగుతుంది.

వాహకం: పచ్చ దోమ

లక్షణాలు:

  • పెరుగుదళ లేని మొక్కలు, ఆకులు పసుపు నుండి నారింజ రంగు వర్ణంలోకి మారడం గమనించవచ్చు.

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

వాహకం ఉండడం వలన, వైరస్ ఆశించించిన పంట అవశేషాలు మరియు కలుపు మొక్కలు పొలంలో ఉండడం వలన ఈ తెగులు వ్యాప్తికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

వాడుకోదగిన రసాయనాలు:

(గమనిక: పంటకు రైస్ టుంగ్రో వైరస్ సోకినట్లయితే, దానిని అరికట్టడం లేదా నయం చేయడం సాధ్యం కాదు. కింది కనపర్చిన ఉత్పత్తులను వాడడం వలన వాహకాన్ని నియంత్రించడానికి మరియు పొలంలో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఉపయోగపడుతాయి )

  ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
చెస్ పురుగుమందు పైమెట్రోజైన్ 50 % WDG
లారా 909 పురుగుమందు క్లోరోపైరిఫాస్50%  + సైపర్‌మెత్రిన్ 5% EC
అన్షుల్ లక్ష్ పురుగుమందు లాంబ్డా సైహలోథ్రిన్ 5% EC
అనంత్ పురుగుమందు థయామెథాక్సామ్ 25 % WG
  1. ఫుట్ రాట్  / బకానే / మూర్ఖపు మొలక వ్యాధి:

తెగులు కారకం: గిబ్బెరెల్లా ఫుజికురోయ్

తెగులు ఆశించే దశలు: మొలక నుండి  కంకి ఏర్పడే దశ వరకు

లక్షణాలు:

  • ఈ తెగులు నారుమడి లోని నారు మరియు ప్రధాన పొలంలోని మొక్కలకు కూడా ఆశిస్తుంది.
  • తెగులు సోకిన మొక్కలు పసుపు పచ్చ మరియు లేత ఆకులతో పొడవైన మరియు సన్నటి పిలకలను ఉత్పత్తి చేస్తాయి.

అనుకూలమైన పరిస్థితులు:

తెగులు సోకిన విత్తనాలు, బలమైన గాలి మరియు నీరు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పరుస్తాయి.

 వాడుకోదగిన రసాయనాలు:

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
రోకో (విత్తన చికిత్స కోసం) థియోఫనేట్ మిథైల్ 70% WP
కంపానియన్ మాంకోజెబ్ 63% +కార్బెండజిమ్ 12% WP
నాటీవో టెబుకోనజోల్ 50% + ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్ 25% WG
టాటా అయ్యాన్ క్రెసోక్సిమ్ – మెథ్యల్ 40%+ హెక్సాకోనజోల్ 8% WG
  1. కాండం కుళ్ళు తెగులు:

తెగులు కారకం: స్క్లెరోటియం ఒరైజె

తెగులు ఆశించే దశలు: పిలకలు ఏర్పడే దశ

లక్షణాలు :

  • పోటాకు పైన చిన్న చిన్న నల్లని మచ్చలు ఏర్పాడతాయి.
  • తరువాత, తెగులు ఉదృతి పెరిగేకొద్ది దుబ్బు మొత్తం వాలిపోతాయి మరియు తాలు గింజలు ఏర్పడతాయి.

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

అధిక నత్రజని ఎరువుల వాడకం, తెగులు సోకిన పంట వ్యర్ధాలు, పురుగుల వల్ల అయిన గాయాలతో ఉన్న మొక్కలు వ్యాధి సోకడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి. 

వాడుకోదగిన రసాయనాలు :

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
బావిస్టిన్ పురుగుమందు కార్బెండజిమ్ 50% WP
అవన్సర్ గ్లో  పురుగుమందు 8.3% అజోక్సిస్ట్రోబిన్  + 66.7% WG మాంకోజెబ్
అవతార్ పురుగుమందు జైనెబ్ 68%  + హెక్సాకోనజోల్ 4%
BC కంట్రోల్  పురుగుమందు వాలిడమైసిన్ 3% L
  1. గడ్డి దుబ్బు తెగులు : 

తెగులు కారకం: రైస్ గ్రాసీ స్టంట్ వైరస్

తెగులు ఆశించే దశలు: అన్ని దశలలో పంటను ఆశిస్తుంది కానీ పిలక దశలో నష్టం కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 

వాహకం: సుడిదోమ

 లక్షణాలు:

  • ఎదుగుదల తగ్గిపోవడం, ఒకే దుబ్బుకి ఎక్కువగా పిలకలు రావడం
  • తెగులు సోకిన దుబ్బు మొత్తం రోసేట్టి ఆకారంలో కనిపిస్తుంది 

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

వరిని నిరంతరం మరియు ఏడాది పొడవునా పండించే ప్రదేశాలు వాహకం వ్యాప్తి చెందడానికి అనుకూలమైన ప్రదేశాలు

వాడుకోదగిన రసాయనాలు:

(గమనిక: పంటకు ఈ తెగులు సోకితే, దానిని అరికట్టడం లేదా నయం చేయడం సాధ్యం కాదు. వాహకం సుడిదోమని నియంత్రించడానికి మరియు వ్యాప్తిని తగ్గించడానికి కింద పేర్కొన్న ఉత్పత్తులను వాడండి)

ఉత్పత్తి పేరు సాంకేతిక పదార్ధం
లాన్సర్ గోల్డ్ పురుగుమందు ఎసిఫేట్ 50 % ఇమిడాక్లోప్రిడ్ 1.8 % SP
ప్రిడేటర్ పురుగుమందు క్లోరోపైరిఫాస్ 50 % EC
కాత్యాయని BPH సూపర్ పురుగుమందు పైమెట్రోజైన్ 50% WG
ఓడిస్ పురుగుమందు బుప్రోఫెజిన్ 20% + అసెఫట్ 50%
  1. ర్యాగ్డ్ స్టంట్ తెగులు:

తెగులు కారకం: రైస్ ర్యాగ్డ్ స్టంట్ వైరస్

తెగులు ఆశించే దశలు: అన్ని ఎదుగుదల దశలు కానీ పైరు వేసే దశలో చాలా హాని చేస్తాయి.

వాహకం:  సుడిదోమ

లక్షణాలు:

  • ఆకుల అంచులలో సమానంగా లేకపోవడం  ఆకులను ముడిచ్చినట్లుగా కనిపించడం జరుగుతుంది
  • తెగులు సోకిన మొక్కలు సరిగ్గా ఎదగకపోవడం, వెన్ను సరిగ్గా బయటకి రాకపోవడం గమనించవచ్చు

తెగులు ఆశించడానికి సహకరించే పరిస్థితులు :

వరిని నిరంతరం మరియు ఏడాది పొడవునా పండించే ప్రదేశాలు వాహకం ద్వారా తెగులు వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి.

వాడుకోదగిన రసాయనాలు:

(గమనిక: పంటకు రైస్ రాగ్డ్ స్టంట్ తెగులు సోకినట్లయితే, దానిని అరికట్టడం లేదా నయం చేయడం సాధ్యం కాదు. వాహకమైన సుదిదోమని నియంత్రించడానికి మరియు వరి పొలంలో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దిగువన పేర్కొన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు)

ఉత్పత్తి పేరు సాంకేతిక విషయం
లాన్సర్ గోల్డ్ పురుగుమందు ఎసిఫేట్ 50 % + ఇమిడాక్లోప్రిడ్ 1.8 % SP
ప్రిడేటర్ పురుగుమందు క్లోరోపైరిఫాస్ 50 % EC
కాత్యాయనీ BPH సూపర్ పురుగుమందు పైమెట్రోజైన్ 50% WG
ఓడిస్ పురుగుమందు బుప్రోఫెజిన్ 25% + అసెఫట్ 50% WP

 

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles