భారత దేశంలో ఆహార ధాన్యా పంటల సాగు విస్తరణంలో 1/4వ వంతు విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబడుతుంది. చాలా వరకు ప్రపంచ దేశాలలో వరిని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. వరి ఉత్పత్తిలో చైనా తర్వాత భారత దేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశం 2022-23 సంత్సరంలో 125 టన్నుల వరిని ఉత్పత్తి చేయడం జరిగింది. 2022-23 సంవత్సరంలో మొత్తం 45.5 మిలియన్ హెక్టర్ల విస్తరణంలో పండించగా హెక్టార్ కు సగటున 4.1 టన్నుల ఉత్పత్తి రావడం జరిగింది. భారత దేశంలో వరి ఎక్కుగా కరిఫ్ కాలంలో పండిస్తారు. తేమ మరియు వేడి వాతవరణంలో, ఉష్ణ మండలం మరియు ఉప ఉష్ణ మండలంలో బాగా పెరుగుతుంది.
తెగులు కారకం: పైరికులేరియా ఒరైజె (లైంగిక దశ : మాగ్నాపోర్తే గ్రిసియా)
తెగులు ఆశించే దశలు: అన్ని దశలలో పైరును ఆశిస్తుంది.
వరిని ఆశించే తెగుళ్లలో ఇది ఒక ప్రమాదకరమైన తెగులు. ఈ తెగులు వారి యొక్క ఆకులు, మెడ భాగం, కణుపులు మరియు చివరి భాగాలను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వలన 70-80% వరకు పంట నష్టం కలిగే అవకాశము ఉంది.
దీర్ఘకాలంగా లేదా తరచుగా వర్షాలు, నేలలో సరిపడా తేమ ఉండకపోవడం, తక్కువ ఉష్ణోగ్రత గాలిలో 93-99% వరకు తేమ ఉన్న ప్రాంతాలలో ఈ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
కాంటాఫ్ | హెక్సాకోనజోల్ 5 % EC |
నేటివో | టెబుకోనజోల్ 50%+ ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 25% WG |
ధనుకా కాసు-బి | కాసుగామైసిన్ 3% SL |
ఫోలిక్యూర్ | టెబుకోనజోల్ 250 EC |
తెగులు కారకం: జాన్తోమోనాస్ ఒరైజా
తెగులు ఆశించే దశలు: పిలక దశ నుండి పొట్ట దశ వరకు
నీటిని అందించి మరియు లోతట్టు ప్రాంతంలో వర్షాధారంగా సాగుచేసే పంటలో ఎక్కువగా గమనించవచ్చు. 25 – 34°C ఉష్ణోగ్రత, 70% పైన గాలిలో తేమ శాతం, అధిక నత్రజని, బలమైన గాలులు మరియు నిరంతర వర్షపాతం తెగులు సోకడానికి అనుకూలమైన పరిస్థితులు.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
బ్లూ కాపర్ | కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP |
క్రిస్టోసైక్లిన్ | స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 90% + టెట్రాసిలిన్ హైడ్రోక్లోరైడ్ 10% SP |
జియోలైఫ్ జియోమైసిన్ | కన్సార్టియం ఆఫ్ ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్స్ |
కొనికా | కసుగమైసిన్ 5% + ఆక్సిక్లోరైడ్ 45% WP |
తెగులు కారకం: సరోక్లాడియం ఒరైజా
తెగులు ఆశించే దశలు : పోటాకు దశ
పొడి వాతావరణ పరిస్థుతలతొ పోలిస్తే, తడిగా ఉండే వాతావరణ పరిస్థుతలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అధిక నత్రజని వాడటం , గాయాలు మరియు దెబ్బలు కలిగిన మొక్కలు, అధిక తేమ మరియు 20-28°డిగ్రీల గల ఉష్ణోగ్రత, అధిక సాంద్రతలో నాటుకోవడం ఈ తెగులు ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
ధనుస్టిన్ | కార్బెండజిమ్ 50% WP |
కవాచ్ | క్లోరోథలోనిల్ 75% WP |
టాటా మాస్టర్ | మెటాలాక్సిల్ 8% + మాంకోజెబ్ 64% WP |
కొనికా | కసుగామైసిన్ 5% +కాపర్ ఆక్సిక్లోరైడ్ |
తెగులు కారకం: హెల్మింతోస్పోరియం ఒరైజా
తెగులు ఆశించే దశలు: మొలక దశ నుండి పాలకంకి దశ వరకు
గాలిలో తేమ శాతం 86 – 100%, ఉష్ణోగ్రత 16 – 36°డిగ్రీలు, తెగులు సోకిన విత్తనాలు, కలుపు మొక్కలు, తెగులు సోకిన పంట వ్యర్ధాలు తెగులు సంక్రమణకు అనుకూలమైన కొన్ని పరిస్థితులు.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
టిల్ట్ | ప్రొపికోనజోల్ 25% EC |
కాంటాఫ్ ప్లస్ | హెక్సాకోనజోల్ 5 % SC |
మెర్జెర్ | ట్రైసైక్లాజోల్ 18 % + మాంకోజెబ్ 62 % WP |
గోడివా సూపర్ | అజోక్సిస్ట్రోబిన్ 18.2% + డైఫెనోకోనజోల్ 18.2% SC |
తెగులు కారకం: ఉస్టిలాజినోయిడియా విరెన్స్
తెగులు ఆశించే దశలు: పూత దశ నుండి పంట చివరి దశ వరకు
25-35°డిగ్రీల ఉష్ణోగ్రత, 90% కంటే ఎక్కువ గాలిలో తేమ, అధిక నత్రజని వాడకం, వేగంగా వీచే గాలులు మరియు అధిక వర్షపాతం ఈ తెగులు సోకడానికి సహకరించే పరిస్థితులు.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
అమిస్టార్ టాప్ | అజోక్సిస్ట్రోబిన్ 18.2% + డైఫెనోకోనజోల్ 11.4% SC |
రోకో | థియోఫనేట్ మిథైల్ 70% WP |
కస్టోడియా | అజోక్సిస్ట్రోబిన్ 11% + టెబుకోనజోల్ 18.3% |
బి కంట్రోల్ | వాలిడమైసిన్ 3% L |
తెగులు కారకం: రైజోక్టోనియా సోలాని
తెగులు ఆశించే దశలు: పిలక దశ నుండి కంకి ఏర్పడే దశ వరకు
వర్షాకాలంలో తెగులు వ్యాప్తి చాలా అధికంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, అధిక నత్రజని వాడడం, దగ్గరగా నాటడం పాము పొడ తెగులకు అనుకూలమైన పరిస్థితులు.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
ఫోలిక్యూర్ | టెబుకోనజోల్ 250 EC |
కస్టోడియా | అజోక్సిస్ట్రోబిన్ 11% +టెబుకోనజోల్ 18.3% SC |
బావిస్టిన్ | కార్బెండజిమ్ 50% WP |
టాటా అయాన్ | క్రెసోక్సిమ్-మెథైల్ఎక్స్40% |
తెగులు కారకం: రైస్ టుంగ్రో వైరస్ – RTV (RTSV & RTBV)
తెగులు ఆశించే దశలు: అన్ని దశలలో ముఖ్యంగా షాకీయ దశలో ఆశించడం జరుగుతుంది.
వాహకం: పచ్చ దోమ
వాహకం ఉండడం వలన, వైరస్ ఆశించించిన పంట అవశేషాలు మరియు కలుపు మొక్కలు పొలంలో ఉండడం వలన ఈ తెగులు వ్యాప్తికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
(గమనిక: పంటకు రైస్ టుంగ్రో వైరస్ సోకినట్లయితే, దానిని అరికట్టడం లేదా నయం చేయడం సాధ్యం కాదు. కింది కనపర్చిన ఉత్పత్తులను వాడడం వలన వాహకాన్ని నియంత్రించడానికి మరియు పొలంలో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఉపయోగపడుతాయి )
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
చెస్ పురుగుమందు | పైమెట్రోజైన్ 50 % WDG |
లారా 909 పురుగుమందు | క్లోరోపైరిఫాస్50% + సైపర్‌మెత్రిన్ 5% EC |
అన్షుల్ లక్ష్ పురుగుమందు | లాంబ్డా సైహలోథ్రిన్ 5% EC |
అనంత్ పురుగుమందు | థయామెథాక్సామ్ 25 % WG |
తెగులు కారకం: గిబ్బెరెల్లా ఫుజికురోయ్
తెగులు ఆశించే దశలు: మొలక నుండి కంకి ఏర్పడే దశ వరకు
తెగులు సోకిన విత్తనాలు, బలమైన గాలి మరియు నీరు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పరుస్తాయి.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
రోకో (విత్తన చికిత్స కోసం) | థియోఫనేట్ మిథైల్ 70% WP |
కంపానియన్ | మాంకోజెబ్ 63% +కార్బెండజిమ్ 12% WP |
నాటీవో | టెబుకోనజోల్ 50% + ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్ 25% WG |
టాటా అయ్యాన్ | క్రెసోక్సిమ్ – మెథ్యల్ 40%+ హెక్సాకోనజోల్ 8% WG |
తెగులు కారకం: స్క్లెరోటియం ఒరైజె
తెగులు ఆశించే దశలు: పిలకలు ఏర్పడే దశ
అధిక నత్రజని ఎరువుల వాడకం, తెగులు సోకిన పంట వ్యర్ధాలు, పురుగుల వల్ల అయిన గాయాలతో ఉన్న మొక్కలు వ్యాధి సోకడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి.
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
బావిస్టిన్ పురుగుమందు | కార్బెండజిమ్ 50% WP |
అవన్సర్ గ్లో పురుగుమందు | 8.3% అజోక్సిస్ట్రోబిన్ + 66.7% WG మాంకోజెబ్ |
అవతార్ పురుగుమందు | జైనెబ్ 68% + హెక్సాకోనజోల్ 4% |
BC కంట్రోల్ పురుగుమందు | వాలిడమైసిన్ 3% L |
తెగులు కారకం: రైస్ గ్రాసీ స్టంట్ వైరస్
తెగులు ఆశించే దశలు: అన్ని దశలలో పంటను ఆశిస్తుంది కానీ పిలక దశలో నష్టం కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.
వాహకం: సుడిదోమ
వరిని నిరంతరం మరియు ఏడాది పొడవునా పండించే ప్రదేశాలు వాహకం వ్యాప్తి చెందడానికి అనుకూలమైన ప్రదేశాలు
(గమనిక: పంటకు ఈ తెగులు సోకితే, దానిని అరికట్టడం లేదా నయం చేయడం సాధ్యం కాదు. వాహకం సుడిదోమని నియంత్రించడానికి మరియు వ్యాప్తిని తగ్గించడానికి కింద పేర్కొన్న ఉత్పత్తులను వాడండి)
ఉత్పత్తి పేరు | సాంకేతిక పదార్ధం |
లాన్సర్ గోల్డ్ పురుగుమందు | ఎసిఫేట్ 50 % ఇమిడాక్లోప్రిడ్ 1.8 % SP |
ప్రిడేటర్ పురుగుమందు | క్లోరోపైరిఫాస్ 50 % EC |
కాత్యాయని BPH సూపర్ పురుగుమందు | పైమెట్రోజైన్ 50% WG |
ఓడిస్ పురుగుమందు | బుప్రోఫెజిన్ 20% + అసెఫట్ 50% |
తెగులు కారకం: రైస్ ర్యాగ్డ్ స్టంట్ వైరస్
తెగులు ఆశించే దశలు: అన్ని ఎదుగుదల దశలు కానీ పైరు వేసే దశలో చాలా హాని చేస్తాయి.
వాహకం: సుడిదోమ
వరిని నిరంతరం మరియు ఏడాది పొడవునా పండించే ప్రదేశాలు వాహకం ద్వారా తెగులు వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి.
(గమనిక: పంటకు రైస్ రాగ్డ్ స్టంట్ తెగులు సోకినట్లయితే, దానిని అరికట్టడం లేదా నయం చేయడం సాధ్యం కాదు. వాహకమైన సుదిదోమని నియంత్రించడానికి మరియు వరి పొలంలో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దిగువన పేర్కొన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు)
ఉత్పత్తి పేరు | సాంకేతిక విషయం |
లాన్సర్ గోల్డ్ పురుగుమందు | ఎసిఫేట్ 50 % + ఇమిడాక్లోప్రిడ్ 1.8 % SP |
ప్రిడేటర్ పురుగుమందు | క్లోరోపైరిఫాస్ 50 % EC |
కాత్యాయనీ BPH సూపర్ పురుగుమందు | పైమెట్రోజైన్ 50% WG |
ఓడిస్ పురుగుమందు | బుప్రోఫెజిన్ 25% + అసెఫట్ 50% WP |
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై…
చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLISMBP) 2022లో ఫుడ్ ప్రాసెసింగ్…
పంట అవశేషాల ఇన్-సిటు నిర్వహణ కోసం వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2018లో భారత ప్రభుత్వం ద్వారా పంట అవశేషాల…
జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ (ఎం బి హెచ్ ఎం) భారతదేశంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి…
మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER) అనేది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ…
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారిత రంగాలు…