ఉపోద్ఘాతము :
2023-24 రబీ మార్కెటింగ్ సీజన్ కి సంబంధించిన ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతున్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కనీస మద్దతు ధర పెంపు అనేది రైతుల ఆదాయాన్ని పెంపొందించాలని ముఖ్య లక్ష్యంలో భాగం.
అవలోకనం :
రాబోయే రబీ మార్కెటింగ్ సీజన్ (RMS) 2023-24 కోసం, భారత ప్రభుత్వం ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర సంబంధిత శాఖలతో చర్చించి వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ (CACP) ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో గోధుమ, బార్లీ, పప్పు శెనగ / శెనగ మరియు ఆవాలు వంటి పంటలకు కనీస మద్దతు ధరలను పెంచడం జరిగింది. అదనంగా, వ్యవసాయ మరియు అనుబంధ వస్తువుల ఎగుమతిలో మన దేశం గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ఎగుమతులు 2015-2016లో 32.81 బిలియన్ డాలర్లు ఉండగా 53.1% వృద్ధి కనబరుస్తూ, 2021-22లో 50.24 బిలియన్ డాల్లర్లకు పెరిగింది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) వారు 75000 మంది రైతుల విజయగాథలతో కూడిన పుస్తకాన్ని కూడా విడుదల చేసారు.
ఈ వార్త ప్రధానంగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తోంది, ఎందుకంటే కనీస మద్దతు ధరల పెంపు అనేది వాళ్ళ ఆదాయాన్ని పెంచడమే ముఖ్య లక్ష్యం. కనీస మద్దతు ధర అనేది రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం హామీ ఇచ్చే ధర, కాబట్టి కనీస మద్దతు ధరని పెంచడం ద్వారా, రైతులు తమ పంటలను అధిక ధరకు విక్రయించగలరు మరియు మరింత ఆదాయాన్ని పొందగలరు. అదనంగా వ్యవసాయం మరియు అనుబంధ వస్తువుల ఎగుమతులు పెరగడం కూడా రైతులకు లాభదాయకంగా ఉంటుంది, ఎందుకంటే ఇది వారి ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచడంలో తొడ్పాడుతుంది మరియు అధిక ధరలు పొందే అవకాశాన్నిస్తుంది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) వారు ఆదాయాన్ని పెంచుకుంటున్న ఇతరుల ఉదాహరణలిస్తూ, మిగితా రైతులకు సుపూర్తి కలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యమైన సమాచారం :
- 2023-24 మార్కెటింగ్ సీజన్ కి సంబంధించిన 6 రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచడం జరిగింది
- వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ (CACP) సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది
- రైతుల ఆదాయాన్ని పెంచడమే దీని యొక్క లక్ష్యం
- వ్యవసాయ మరియు అనుబంధ ఎగుమతులు, 2015-2016 నుండి 2021-2022 వరకు 53.1% వృద్ధి కనబరిచాయి
- 75000వేల మంది రైతులు విజయగాధలను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) వారు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పంచుకున్నారు
శీర్షిక :
2023-24 రబీ మార్కెటింగ్ సీజన్ కి సంబంధించిన ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల పండించిన పంటలకు ధరలు పెరగడం ద్వారా రైతులకి లబ్ది చేకూరుతుంది. వ్యవసాయ మరియు అనుబంధ వస్తువుల వలన దేశ ఎగుమతి కూడా గణనీయంగా పెరిగింది. పథకాలను విజయవంతంగా వినియోగించుకోవడం ద్వారా తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగిన 75000 మంది రైతుల విజయగాథలను ICAR వారు పుస్తకంలో ప్రచురించడం జరిగింది. ఇది ఇతర రైతులకు కూడా అదే విధంగా చేయడానికి స్ఫూర్తినిస్తుంది. ఈ నిర్ణయం రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు వ్యవసాయ రంగాన్ని పెంచాలి అనేది ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం.