HomeNewsNational Agri Newsభారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ పూసా జేజి 16ని రూపొందించింది - కరువును తట్టుకోగల ...

భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ పూసా జేజి 16ని రూపొందించింది – కరువును తట్టుకోగల కొత్త శనగ వెరైటీ

జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయ (JNKVV) జబల్‌పూర్, రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వ విద్యాలయం, గ్వాలియర్ మరియు ఇక్రిశాట్ (ICRISAT), పటాన్‌చెరువు, హైదరాబాద్‌ వారి సహకారంతో పూసా సంస్థ అని కూడా పిలువబడే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) ‘పూసా JG 16’, అనే వంగడాని అభివృద్ధి చేసింది. ఇది కరువును తట్టుకునే మరియు అధిక దిగుబడినిచ్చే శనగ రకం.

ICC 4958 నుండి కరువును తట్టుకునే జన్యువును మాతృ రకమైన J.G.16లో ప్రవేశపెట్టడం ద్వారా పుసా JG 16 రకం జెనోమిక్ బ్రీడింగ్ పద్ధతిని ఉపయోగించి సృష్టించబడింది. శనగ పై అఖిల భారత సహకార పరిశోధన కార్యక్రమం ద్వారా ఈ రకం కరువు నిరోధకతను ధృవీకరించడానికి దేశవ్యాప్తంగా ఒక ప్రయోగం జరిగింది. వివిధ రకాల కరువు ఒత్తిడిలో ఈ వంగడం హెక్టారుకు 2 టన్నుల ఉత్పత్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంది; ఇది ఫ్యూసేరియం ఎండు తెగులు మరియు తక్కువ వృద్ధి వ్యాధికి నిరోధకతను కలిగి ఉంటుంది మరియు శీఘ్ర పరిపక్వత కాలం (110 రోజులు) కలిగి ఉంటుంది.

ఫ్యూసేరియం ఎండు తెగులు:

ఫ్యూసేరియం ఎండు తెగులు అనేది విస్తృతమైన మొక్కల వ్యాధి. ఇది మట్టిలో నివసించే శిలీంద్రం ఫ్యూసేరియం ఆక్సిస్పోరమ్ ద్వారా వస్తుంది. చిలగడదుంపలు, టమాటాలు, బీన్స్, పుచ్చకాయలు, అరటి (పనామా ఎండు తెగులు అని పిలుస్తారు) మరియు అనేక ఇతర పంటలు అనగా వాణిజ్యపరంగా ముఖ్యమైన ఆహార పంటలతో సహా వృక్ష జాతులు ఈ ఎండు తెగులు భారిన పడతాయి. ఫ్యూసేరియం ఆక్సిస్పోరమ్ సజీవ అతిధేయ మొక్కతో సంబంధం లేకుండా మట్టిలో నిరవధికంగా జీవించగలదు మరియు 24 °C (75 °F) కంటే ఎక్కువ నేల ఉష్ణోగ్రతల వద్ద వృద్ధి చెందుతుంది.

లక్షణాలు:

  • తెగులు సోకినప్పుడు వాడిపోయి చనిపోతాయి.
  • లేత ఆకుపచ్చ నుండి బంగారు పసుపు వర్ణానికి మరీన తర్వాత కాండం యొక్క మొదలు భాగము నుండి పైకి, ఆకులు క్రమంగా చనిపోతాయి మరియు పెరుగుదల కుంటిపడుతుంది.
  • వేర్లు మరియు కింద భాగములోని కాండం యొక్క దారువు నాలికాకణజాలంలో నల్లటి చారలు ఏర్పడి వేర్లు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది.
spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles