HomeNewsయునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ అఫ్ అగ్రికల్చర్ (USDA)చే ఆమోదించబడిన తేనెటీగ యొక్క ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి వ్యతిరేకంగా...

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ అఫ్ అగ్రికల్చర్ (USDA)చే ఆమోదించబడిన తేనెటీగ యొక్క ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి వ్యతిరేకంగా పని చేసే ప్రపంచంలోని మొట్ట మొదటి టీకా

తేనెటీగలలోని పెనిబాసిల్లస్ లార్వా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ప్రాణాంతక అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ USDAచే ఆమోదించబడింది. ఇది ప్రపంచంలోని మొట్ట మొదటి వ్యాక్సిన్ (లభ్యత ఈ సంవత్సరం నుండి ఉంటుందని అంచనా) మరియు USలోని వాణిజ్య తేనెటీగల పెంపకందారులకు (పరిమిత ప్రాతిపదికన) సరఫరా చేయబడుతుంది.

వ్యాక్సిన్ పని చేయు విధానం

వ్యాక్సిన్‌లో పెనిబాసిల్లస్ యొక్క చంపబడిన కణం ఉంటుంది. టీకాను  కూలి ఈగలు తినే రాణి ఆహారంతో కలుపుతారు, మరియు ఇది రాజాహరంగా కలిసిపోతుంది. ఈ రాజాహారాన్ని కూలి ఈగలు రాణికి తినిపిస్తాయి మరియు అది దానిని తీసుకున్న తర్వాత, వ్యాక్సిన్ యొక్క కణాలు రాణి ఈగ అండాశయాలలో స్థిరపడతాయి. ఇది అభివృద్ధి చెందుతున్న లార్వాలను పొదిగినప్పుడు ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.

ఫౌల్‌బ్రూడ్ వ్యాధి అమెరికా దేశంలో ఉద్భవించింది మరియు ఇది ప్రపంచ వ్యాధిగా మారింది. ఇది ఒక అంటు వ్యాధి మరియు ఇప్పటి  వరకు ఎటువంటి నివారణ లేదు. ఈ వ్యాధి బారిన పడినప్పుడల్లా తేనెటీగల పెంపకందారులు దానిని కాల్చడం మరియు వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి సమీపంలోని కాలనీలకు యాంటీబయాటిక్స్ అందించడం ద్వారా నాశనం చేసేవారు. కానీ ఇప్పుడు, ఈ టీకా అమెరికాలోని తేనెటీగల పెంపకందారులందరికీ ఒక ఆశీర్వాదంగా నిరూపించబడుతుంది.

Categories:
spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles