భారతదేశ ప్రభుత్వం మెగా ఫ్లాగ్‌షిప్ పథకం, అగ్రి-క్లినిక్స్ మరియు అగ్రి-బిజినెస్ (ఏసి & ఏబిసి), నాబార్డ్ వారి సహకారంతో 2002 నుండి అమలు చేయబడింది. ఈ పథకం కింద, నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి అర్హత పొందిన వారికి బ్యాంకు నుండి రుణాలు మరియు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు సేవలు అందించడం మరియు గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.
అవలోకనం :
సెంట్రల్ సెక్టార్ పథకం అయినటువంటి అగ్రి క్లినిక్స్ మరియు అగ్రి వ్యాపారం క్రింద శిక్షణ పొంది, రైతులకు సేవలు చేస్తున్న అగ్రి వ్యాపారవేత్తలకు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బహుమతులు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రి వ్యవసాయ రంగ పారిశ్రామికవేత్తలు భారత ప్రభుత్వం నుండి సీనియర్ అధికారులు, ICAR శాస్త్రవేత్తలు మరియు బ్యాంకర్లు మరియు ప్రైవేట్ రంగ సంస్థల నుండి వేడుకకు హాజరు అవ్వడం జరిగింది. వ్యవసాయ రంగ పారిశ్రామికవేత్తలు RKVY-RAFTAAR మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మరియు ఈ పథకాల క్రింద ఉన్న ఇతర అవకాశాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది.
ఈ కథనం ప్రధానంగా ఏసీ & ఏబిసి పథకం నుండి శిక్షణ పొందిన వ్యవసాయ రంగ పారిశ్రామికవేత్తలకు, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న శిక్షకులు మరియు సంస్థలకు ప్రయోజనం ఉంటుంది. ఏసి & ఏబిసి కార్యక్రమంలో వ్యవసాయ రంగ పరిశ్రామికవేత్తలుకు బహుమతులు ఇవ్వడంతో పాటు పురోగతులు పై తమను తాము పెంపొందించడానికి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదనంగా, ఈ కథనం వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, నాబార్డ్ మరియు ప్రధాన బ్యాంకులు అలాగే ప్రైవేట్ వ్యవసాయ కంపెనీలు ఏసి & ఏబిసి పథకం అమలు మరియు ఇతర అవకాశాల గురించి తెలియచేయాలనీ లక్ష్యం పెట్టుకుంది. ఈ కార్యక్రమంకు హాజరు అయిన ప్రేక్షకులకు మరియు పాల్గొన్న వారికి ప్రయోజనకరమైన ఇతర పథకాలు మరియు అగ్రి వ్యాపారవేత్తలుకు తాజా అభివృద్ధి మరియు అవకాశాలు గురించి తెలియచేయడం జరిగింది.
వివరణ :
భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారత ప్రభుత్వం నిర్వహించిన కేంద్ర రంగ పథకం అయినట్టు వంటిఏ సి మరియు ఏ బి సి కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన వ్యక్తులకు అవార్డులు ఇవ్వడం జరిగింది. 45 రోజుల పాటు ఉచితంగా ఇంటిదగ్గర శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు బ్యాంకుల నుండి రుణం మరియు సబ్సిడీతో స్వయం ఉపాధి కలిగిన అగ్రి వ్యాపారవేత్తలుగామార్చాలని ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.ఈ కార్యక్రమం రైతులకు మరియు గ్రామీణ యువతకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఈ వేడుక న్యూ ఢిల్లీలో జరిగింది మరియు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 850 మందికి పైగా అగ్రి వ్యాపారవేత్తలు, వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, MANAGE, నాబార్డ్, ప్రధాన బ్యాంక్‌లు, ICAR శాస్రవేత్తలు మరియు ప్రైవేట్ వ్యవసాయ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విధాన సంస్కరణలు, తాజా పరిణామాలు, సబ్సిడీలు మరియు పథకం క్రింద ఇచ్చే రుణాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మరియు RKVY-RAFTAAR వంటి పథకాల క్రింద ఉన్న అవకాశాలపై ప్రదర్శనలు మరియు చర్చలు కూడా జరిగాయి. ముఖ్య అతిధిగా జాయింట్ సెక్రటరీ, వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, నాబార్డ్ మరియు బ్యాంకింగ్ రంగం నుండి నిధులు పొందాలని యువతకు విజ్ఞప్తి చేసారు.
ముఖ్య విషయాలు :
- అగ్రి-క్లినిక్స్ మరియు వ్యవసాయ-వ్యాపారాల పథకం (ఏసి & ఏబిసి) అనేది 2002 నుండి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) సహకారంతో అమలు చేయబడిన ప్రభుత్వ కార్యక్రమం.
- బ్యాంకు రుణం మరియు సబ్సిడీ సహాయంతో నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి అగ్రి వ్యాపారవేత్తలుగా మార్చే లక్ష్యంతో ఈ పథకంలో ఒకటిన్నర నెల ఇంటిదగ్గరే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
- రైతులకు సేవలను అందించడం మరియు గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం.
- జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అగ్రి-క్లినిక్ మరియు వ్యవసాయ వ్యాపార పథకం క్రింద రైతులకు సేవల చేసినవారికి గాను 82 మంది ఉత్తమ అగ్రి వ్యాపారవేత్తలకు మరియు 8 ఉత్తమ నోడల్ శిక్షణా సంస్థలకు బహుమతులు ఇవ్వడం జరిగింది.
- విధాన సంస్కరణలు, కొత్త పరిణామాలు, పథకం కింద ప్రోత్సాహకాలు, రుణాలు మరియు ఇతర పథకాల క్రింద అవకాశాలపై కూడా చర్చ జరిగింది.
- ముఖ్య అతిధిగా జాయింట్ సెక్రటరీ, వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, నాబార్డ్ మరియు బ్యాంకింగ్ రంగం నుండి రుణాలను/నిధులను పొంది లబ్ది చేకూర్చుకోవాలని యువతకు విజ్ఞప్తి చేసారు.
శీర్షిక :
భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడంతో పాటు సెంట్రల్ సెక్టార్ పథకం అయినటువంటి అగ్రి క్లినిక్స్ మరియు అగ్రి వ్యాపారం క్రింద శిక్షణ పొంది, రైతులకు సేవలు చేస్తున్న అగ్రి వ్యాపారవేత్తలుకు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ICAR శాస్త్రవేత్తలు ప్రముఖ బ్యాంకులు, ప్రైవేట్ వ్యవసాయ వ్యాపారాల సంస్థలు, వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరు అయ్యారు. ఈ బహుమతులు ప్రదానోత్సవం అగ్రి వ్యాపారవేత్తల యొక్క కృషికి మరియు విజయాలకు గుర్తింపుగా మరియు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలను అందించడమే ఈ ఏసి & ఏబిసి పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమానికి హాజరు అయిన ప్రేక్షకులకు మరియు పాల్గొన్నవారికి ప్రయోజనకరమైన ఇతర పథకాలు, అగ్రి వ్యాపారవేత్తల కోసం తాజా అభివృద్ధి మరియు అవకాశాలు గురించి తెలియచేయడం జరిగింది.