HomeCropపసుపు సాగు కోసం నేల తయారీ  :

పసుపు సాగు కోసం నేల తయారీ  :

భారతదేశం 2020-21వ సంవత్సరంలో 11.02 లక్షల టన్నుల పసుపు ఎగుమతి చేయడం జరిగింది. భారతదేశపు పసుపులో అధిక కర్క్యుమిన్ శాతం ఉండడం వలన, అంతర్జాతీయంగా మన పసుపుకు డిమాండ్ ఎక్కువ ఉంది. వెబ్-మెడ్ ప్రకారం పసుపు కీళ్లనొప్పులకు, గుండెల్లో మంట (డేస్పెప్సీయా), కడుపు నొప్పి, విరోచనాలు, పేగులో గాలి, కడుపు ఉబ్బరం, జాండిస్, కాలేయ సమస్యలు మరియు పిత్తాశయం రుగ్మతలు వంటి వాటికీ ఉపయోగపడుతుంది.

విత్తన ఎంపిక

భారత దేశంలో చాలా పసుపు రకాలు అందుబాటులో ఉన్నాయి. అమృతపాణి, ఆర్మూర్, దుగ్గిరాల, టేకురాపేట, పట్టంట్, దేశి, మూవాట్టుపుజహ, వ్యనాద్, రాజపూర్, కార్హది, వైగన్, చిన్ననాధన్, పెరియనదా, కో 1, BSR 1, రోమా, స్వర్ణ, సుదర్శన్, సుగుణ, సుగంధం, BSR 2, రంగా, రష్మీ, రాజేంద్ర సోనియా, కృష్ణ, సురోమా, అల్లేపీ ఫింగర్ పసుపు (AFT), IISR ప్రభ, IISR ప్రతిభ, IISR అల్లేప్పేయ్ సుప్రీమ్ మరియు IISR కేదారం మొదలైనవి కొన్ని ప్రసిద్ధ రకాలు.

పసుపు విత్తన శుద్ధి

పసుపు కొమ్ముల ద్వారా సాగు చేయడం జరుగుతుంది. విత్తన కొమ్ములను చిన్న ముక్కలుగా కత్తిరించి వాటిని డైమిథోయేట్ 30% EC 2 మి.లి./లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 36 WSC 1.5 మి.లి./లీటర్ నీటికి మరియు 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ (3 గ్రా./లీటర్ నీటికి) 30 నిమిషాలు నానపెట్టాలి. ప్రత్యామ్నాయ విత్తన శుద్ధి పద్ధతిలో భాగంగా విత్తన కొమ్ములను సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ (10 గ్రా./కిలో విత్తన కొమ్ములకి) మరియు ట్రైకోడెర్మా విరిడి (4 గ్రా. కిలో విత్తన కొమ్ములకి) తో విత్తన శుద్ధి చేసుకోవచ్చు.

పసుపు సాగుకు నేల తయారీ విధానం

ప్రధాన పొలాన్ని ఒక సారి ఉలితో, ఒక సారి డిస్క్ నాగలితో  మరియు మడకలతో రెండు సార్లు, ఇలా నాలుగు సార్లు దున్నుకోవాలి. దీని తరువాత 45 సెంటీమీటర్ల అంతరంలో బోదెలు, కాలువలను తయారు చేసుకోవాలి లేదా 120 సెంటీమీటర్ల వెడల్పుతో ఎత్తు మడులను 30 సెంటీమీటర్ల అంతరంతో ఏర్పారుచుకోవాలి. నేలలోని తేమ స్థాయిని బట్టి, బిందు సేద్యం ద్వారా మడులను 8-12 గంటల పాటు తడుపుకోవాలి.

చివరి దుక్కిలో 25 టన్నులు పశువుల ఎరువు, వేప పిండి లేదా వేరుశెనగ పిండి 200 కేజీలు ఒక హెక్టరుకు,  ఒక హెక్టారుకు 25:60:108 కేజీల నత్రజని, బాస్వరం, పొటాష్; 30 కేజీల ఫెర్రస్ సల్ఫేట్  మరియు 15 కేజీల జింక్ సల్ఫేట్, 10 కిలోల అజోస్పైళ్ళమ్ మరియు ఫాస్ఫోబాక్టీరియా వేసుకోవాలి.

పసుపు పండించడానికి అవసరమైన నేలలు

పసుపు సాగుకు బలమైన నేలలు శ్రేష్టమైనవి. ఉష్ణమండల పరిస్థితులలో సారవంతమైన ఎర్రటి గరప నేలలు లేదా నీరు నిలువని బంక మట్టి నేలలో పసుపు బాగా పండుతుంది. వార్షిక వర్షపాతం 1500 mm ఉన్న ప్రాంతాలు పసుపు సాగుకు అనుకూలమైనవి.

శీర్షిక

పసుపు సాగుచేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. పసుపుకు స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వలన మరియు నిల్వ గుణం ఉండడం వలన, ధర తక్కువగా ఉన్నప్పుడు శీతల గిడ్డంగులలో నిల్వ ఉంచుకొని, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది.

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles