HomeCropఅల్లం కోసం నేల తయారీ విధానం

అల్లం కోసం నేల తయారీ విధానం

భారతదేశం 2021-22వ సంవత్సరంలో 21.20 లక్షల టన్నులు అల్లం ఉత్పత్తి చేసింది. అదే సంవత్సరంలో భారతదేశం 837.34 కోట్లు విలువ చేసే 1.48 లక్షల టన్నుల అల్లం ఎగుమతి చేయడం జరిగింది. భారతదేశంలో  అల్లం పండిస్తున్న ప్రముఖ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర మరియు మేఘాలయ. అల్లం జలుబుకు, దగ్గుకు, విరోచనాలకు, కళ్ళు తిరుగుతున్నప్పుడు, రక్తపోటుకు మరియు మందగించిన చూపుకు వంటి సమస్యలకు వాడవచ్చును. భారతదేశ సంప్రదాయాల ప్రకారం ఆయుర్వేద మందుగా జీర్ణం, జ్వరం మరియు కడుపు వ్యాధులు వంటి వాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

విత్తన ఎంపిక :

హైబ్రిడ్ మరియు GMO రకాల కంటే ఎక్కువ స్థానిక మరియు సాంప్రదాయ రకాలు ఉన్నాయి. ప్రసిద్ధి రకాలు IISR సుప్రభా, సురుచి, సురభి, హిమగిరి, చైనా, అస్సాం, మారన్, హిమాచల్, నాడియా మరియు రియో డి జనైరో.

అల్లం విత్తన శుద్ధి :

అల్లం దుంపలు లేదా కొమ్ముల ద్వారా సాగు చేయబడుతుంది. ఈ కొమ్ములను  విత్తన కొమ్ములుగా పిలవడం జరుగుతుంది. ఈ కొమ్ములను 2.5-5.0 సెం.మి. పొడుగుతో, 20-25 గ్రాములు ఉండే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. జాగ్రత్తగా ప్రతి ఒక చిన్న ముక్కలో రెండు లేదా మూడు మంచి కళ్ళు (మొగ్గలు) ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విత్తన కొమ్ములను మ్యాంకోజెబ్ 0.3% (3 గ్రా./లీ నీటికి) ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత 3-4 గంటలు నీడలో ఆరబెట్టాలి. ఇలా చేయడం ద్వారా కొమ్ములకు సోకే తెగుళ్ల నుండి కాపాడుకోవచ్చు.

అల్లం సాగు కోసం నేల తయారీ విధానం :

అల్లం సాగు కోసం నేలను 4 నుండి 5 సార్లు మట్టి పొడిగా అయ్యేంత వరకు దున్నుకోవాలి. చివర దుక్కి చేసేటప్పుడు భూమిలో బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును హెక్టరుకు 25-30 టన్నులు  వేసుకోవాలి.

దీని తర్వాత ఎత్తయిన సమతుల మడులు 1 మీ. వెడల్పు మరియు 30 సెంటీమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళ నడుమ 50 సెంటీమీటర్ల అంతరం ఉండే లాగ తయారు చేసుకోవాలి. కొమ్ములు వ్యాధులకు మరియు నులి పురుగుల తాకిడికి గురి అవ్వడం వలన దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. దీనికి చివరి దుక్కిలో హెక్టారుకు 2 టన్నులు వేప పిండి వేయడం ద్వారా నివారించవచ్చు. అల్లం పంటకు మొదట్లో నత్రజని, బాస్పరం మరియు పొటాష్ (NPK) యొక్క నిష్పత్తి ప్రాంతాలనుగుణంగా మారుతూ ఉంటుంది. సాధారణ NPK  సిఫార్సు హెక్టారుకు 100:50:50 కేజీలు గా ఉంటుంది.

అల్లం పంట సాగు కోసం అవసరమైన నేల రకాలు:

అల్లం పండించడానికి చాలా నిర్దిష్ట రకాల నేలలు అవసరం. అల్లం అధిక పోషకాలను గ్రహించే స్వభావం కారణంగా ఏడాది తర్వాత అదే మట్టిలో పెరగదు. అల్లం చల్క నేలలో, బంక మట్టి నేలలో, ఎర్ర నేలలో మరియు గరప నేలలో బాగా పండుతుంది. హ్యూమస్‌తో కూడిన మంచి నీటి సౌకర్యం ఉన్న మెత్తటి నేలలు అనుకూలం. నీరు నిలిచే బంక మట్టి నేలలు అల్లం సాగుకు పనికిరావు. 

అల్లం ఉత్పతికి అవసరమైన నేల ఉదజన సూచిక  :

అల్లం 5.5 నుండి 6.5 ఉదజని సూచిక గల లోతైన మరియు వదులుగా ఉన్న నేలలో బాగా పండుతుంది. 

శీర్షిక :

అల్లం అధిక పోషకాలను గ్రహించే స్వభావం గల పంట కాబట్టి, ఈ సంవత్సరం అల్లం పండించిన నేలలో వచ్చే సంవత్సరం దిగుబడి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అల్లం సాగు కొంచెం కష్టంతో కూడుకున్న పంట మరియు  ఇది ఒక దీర్ఘకాల పంట. అల్లంకు మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉండడం వలన, ఏ విలువ జోడింపు చర్యలు చేపట్టకపోయిన కూడా ఆశించిన రాబడిని ఇవ్వగల పంట.

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles