HomeCropగోధుమ పంట నేల తయారీ విధానం

గోధుమ పంట నేల తయారీ విధానం

గోధుమ ప్రధానంగా, భారతదేశపు ఉత్తర భాగంలోని ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యాన, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో పండిస్తారు.  2021-22 సంవత్సరంలో  15,840.31 కోట్లు విలువ చేసే 7,239,366.80 మెట్రిక్ టన్నుల గోధుమలను బయట దేశాలకు ఎగుమతి చేయబడింది. గోధుమను బంకమట్టి నేలలో శీతాకాల పంటగా  పండిస్తారు.  గోధుమ పంట, పొడి పంట కాబట్టి మంచి గాలి ప్రసరణ అవసరం.

గోధుమలో విత్తన ఎంపిక మరియు విత్తన శుద్ధి:-

గోధుమలలో ఎంచుకోడానికి వివిధ రకాల విత్తనాలు  ఉన్నాయి. స్థానిక రకాలు, హైబ్రిడ్ రకాలు మరియు దిగుమతి చేసిన రకాలు ఉన్నాయి.  ప్రసిద్ధ రకాలుగా DBW 222, DBW 252, DDW47, DBW 187, DBW 173, HD 2851, HD 2932, PBW 1 Zn, Unnat PBW 343, PDW 233, WHD 943, TL 2908 ఉన్నాయి .  DBW 222 పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాకాండ్, రాజస్థాన్ లోని కొన్నిబాగాలకు  అనుకూలమైన రకం. DBW 222  తుప్పు తెగులు నిరోధకతను కలిగిన రకం. DBW 252 అను రకం  ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం మరియు ఈశాణ్య రాష్ట్రాలకు అనుకూలమైన రకం.

విత్తనాలు ముందుగా నానబెట్టడం: (తీసుకున్న సమయం)

గోధుమలను ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. 8-13 గంటల సమయం నానబెట్టడం సరిపోతుంది.  ఎక్కువ నానబెట్టడం వలన  విత్తనాలకు తెగుళ్ళు సోకి కుళ్ళిపోయి సాగుకు అనుకూలం కాకుండా పోయే ఆస్కారం ఉంది .

విత్తన శుద్ధి : గోధుమలు 

ప్రాంతాలకు, వాతావరణ పరిస్థితులకు మరియు నేల పరిస్థితులను బట్టి వివిధ రకాలైన విత్తన శుద్ధి పద్ధతులు ఉన్నాయి.   సాధారణంగా తెగుళ్ల మందులు మరియు పురుగు మందులతో విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితుల వలన  వివిధ తెగుళ్ళు, కుళ్ళు తెగుళ్ళు మరియు ఆకు మాడు తెగులు విత్తనాలకు వ్యాప్తి చెందుతాయి. గోధుమలలో వచ్చు లూస్ స్మట్ మరియు ఫ్లాగ్ స్మట్  తెగుళ్లకు టేబుకోనోజోల్ 1g/1 కేజీ విత్తనాలకు  లేదా భావిస్టిన్ 2.5 గ్రాములు / కేజీ విత్తనాలకు.  సీడ్ డ్రెస్సింగ్ డ్రమ్ ని ఉపయోగించి విత్తన శుద్ధి చేయాలి. ట్రైకోడెర్మా విరిడే 4గ్రా /కేజీ విత్తనాలతో  విత్తన శుద్ధి చేయడం ద్వారా చాలా ఉపయోగకరంగా  ఉంటుంది మరియు తుప్పు తెగులు తీవ్రతను తగ్గిస్తుంది.

 గోధుమ విత్తనాల కోసం నర్సరీ బెడ్ తయారీ

గోధుమ పంటకి, వరి పంటకు అవసరం అయ్యే నారు పెంపకం లాగ అవసరం లేదు. నేరుగా విత్తనాన్ని విత్తడమే ప్రధానంగా ఆచరించే పద్ధతి. (సాధారణంగా) గోధుమ పంటకు పొలం తయారు చేసుకొని, విత్తనాలను చల్లుతారు. అయితే ఈ మధ్య కాలంలో లైన్ పద్దతిలో విత్తడం ఆచరణలోకి వచ్చింది.

గోధుమ పంట కోసం నేల తయారీ విధానం :

ఇనుప నాగలితో రెండుసార్లు మరియు మూడు సార్లు, మడకలతో/కల్టివేటర్ తో  తగిన లోతుకు దున్నుకోవాలి.  చివర దుక్కిలో,  హెక్టారుకు 12 టన్నుల పశువుల ఎరువు, 5 కేజీల  జీవ ఎరువులు, 5 కేజీల ట్రైకోడెర్మా మరియు 5 కేజీల సూడోమొనాస్ వేసుకోవాలి.

గోధుమల పంటకు నేల ఎంపిక :

గోధుమలకు, మంచి ఆకృతి, నిర్మాణం మరియు మితమైన నీటిని పట్టి ఉంచే సామర్థ్యం గల బంకమట్టి నేలలు అవసరం. నీటిని వడిసిపట్టుకోలేని నేలలను ఎంచుకోకపోవడం మంచిది.

నెల ఉదజని సూచిక :

గోధుమ పంటకు మధ్యస్థ 6.0 -7.0 ఉదజనిక అవరసరం. కాగా ఎక్కువ లేదా తక్కువ ఉదజనిక కలిగిన నేలలో పంట పెరుగుదల మరియు పంట ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది

 సారాంశం :

వివిధ వాతావరణ మరియు యాజమాన్య పరిస్థితులను తట్టుకోగలిగిన గోధుమ పంట దేశం అంతటా సాగులో ఉంది. గోధుమ ఒక ప్రధాన పంట మరియు రైతులకు మంచి లాభాలను ఇస్తుంది. 

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles