HomeCrop మొక్కజొన్న పంట నేల తయారీ విధానం

 మొక్కజొన్న పంట నేల తయారీ విధానం

మొక్కజొన్న (జియా మేజ్) ప్రపంచంలోనే అత్యంత బహుముఖ పంట. ప్రపంచ దేశాలలో భారతదేశం, మొక్కజొన్న పండించడంలో 7వ స్థానంలో ఉంది. 2021-2022 సంవత్సరంలో మన దేశం ప్రపంచానికి 7,615.46 కోట్ల రూపాయిల విలువ గల 3,690,4692.12 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేశాము. భారతదేశంలో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మరియు తమిళనాడు మొక్క జొన్న పండిస్తున్న ప్రధాన రాష్ట్రాలు. బహుముఖ పంట కావడం వలన  మొక్కజొన్న జమ్మూ కాశ్మీర్ మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాల వంటి సాంప్రదాయేతర ప్రాంతాలలో పండించే చాలా ముఖ్యమైన పంట.

విత్తనాల ఎంపిక విధానం :

3000 వేలకు పైగా మొక్కజొన్న రకాలు ఈ రోజు మనకు మార్కెట్ లో  దొరకుతున్నాయి. దేశంలో పండిస్తున్న ప్రధాన రకాలు ఏవంటే  అంబ్రోసియా హైబ్రిడ్ మొక్క జొన్న, జూబ్లీ హైబ్రిడ్ మొక్క జొన్న, హనీ సెలెక్ట్ మొక్క జొన్న, గోల్డెన్ బంఠం మొక్క జొన్న, పోయినీర్ ( P3396 మరియు P3344), డెకల్బ్ ( డికెసి 9178 మరియు డికెసి 9081), సింజెంట ( ఎన్ కె 7328 మరియు ఎన్ కె 30), సి పి (818 మరియు 333), టాటా విత్తనాలు ( డి ఎమ్ హెచ్ 8255), అడ్వాంటా ( హై -బ్రిక్స్ 53), కావేరి విత్తనాలు ( కె ఎమ్ హెచ్ 1411) మరియు హైటెక్ సోనా -5101.

విత్తనాలను ముందుగా నానపెట్టడం

విత్తనాలు మంచిగా మొలకెత్తడం కోసం రాత్రిపూట నానబెట్టాలి.

మొక్కజొన్న విత్తన శుద్ధి

చెద పురుగులు  మరియు ఇతర మట్టి కీటకాలకు ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్ ఎల్  4గ్రా / కిలో విత్తనాలతో  విత్తన శుద్ధి చేయాలి.

విత్తనాల ద్వారా సంక్రమించే తెగుళ్లను నియంత్రించడానికి, విత్తనాలను  కార్బండజిమ్ లేదా తైరం 2గా /కేజీ విత్తనాలతో శుద్ధి చేయాలి.  మొక్క జొన్న విత్తనాలను  విత్తన శుద్ధి చేయడం ద్వారా  స్మట్, బూజు తెగులు, బొగ్గుకుళ్ళు తెగులు  మొదలైన  వాటిని నియంత్రణ చేయవచ్చు. శుద్ధి చేసిన తర్వాత విత్తనాలను నీడ ప్రదేశంలో 15 నిమిషాలు ఉంచి తర్వాత నేరుగా పొలంలో విత్తుకోవచ్చు.

మొక్క జొన్న పొలం తయారీ విధానం :

మొక్క జొన్న  పంట కోసం నేల ఎంపిక

మంచి నీటి ప్రసరణ గల ఇసుక ఎర్ర నేల లేదా నల్ల రేగడి నేల మొక్కజొన్న ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి.

మొక్క జొన్న పంట కోసం నేల ఉదజని సూచిక

మొక్క జొన్న విత్తనం, దాని గట్టి స్వభావం వలన  5.5 నుండి 7.5 మధ్య గల ఉదజని సూచిక  ఉన్న నేలలలో రకాల ఆధారంగా బాగా పండుతుంది.  6 నుండి 6.5 వరకు ఉన్న ఉదజని సూచిక సరైనది అని చెప్పవచ్చు.

మొక్క జొన్న  పంట కోసం నేల తయారీ

మొక్క జొన్న పొలం కోసం పూర్తిగా కలుపు తీసేయాలి. రైతులు కల్టివేటర్ ఉపయోగించి కలుపు మొత్తాన్ని తీసేయొచ్చు. ఇది మునుపటి పంట ఉత్పత్తి అవశేషాలను తొలగిస్తుంది. 12.5 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ చేసిన కొబ్బరి పీచు, 10 కేజీల అజోస్పైరిల్లమ్  వేసి భూమిని 5 నుండి 6 సార్లు దున్నుకోవాలి. తర్వాత  భూమిని  45 సెం.మీ వెడల్పుతో బోదెలు మరియు కాలువలు చేసుకొని నేలను సిద్ధం చేసుకోవాలి. బోదెలు మరియు కాలువల సహాయంతో నీటిని ఆదా చేసుకోవచ్చు.

మొక్కజొన్న విత్తడం

సంప్రదాయంగా మొక్క జొన్న విత్తనాలను నేరుగా పొలంలో  విత్తుతారు. మొక్క జొన్న విత్తనాలను బోదె యొక్క 1/3 ఎత్తులో విత్తుకోవాలి.

సారాంశం

మొక్కజొన్న దేశంలో ఎక్కడైనా పండించగల గట్టి పంట. మొక్కజొన్న తక్కువ నిర్వహణ గల పంట మరియు అధిక రాబడి వచ్చే అధిక డిమాండ్ ఉన్న పంట. వరి మరియు చెఱకు వంటి వాణిజ్య పంటల లాగా కాకుండ మొక్కజొన్నకు నీరు తక్కువ అవసరం. అధిక రాబడి మరియు తక్కువ ఖర్చు కలిగిన పంట మొక్కజొన్న పంట

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles